Wednesday, May 13, 2026
E-PAPER
Homeక్రైమ్పేకాట శిబిరంపై పోలీసుల మెరుపు దాడి

పేకాట శిబిరంపై పోలీసుల మెరుపు దాడి

- Advertisement -

– పేకాట ఆడుతున్న 6 మంది అరెస్ట్
– రూ.23,110 నగదు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని అమీర్ నగర్ గ్రామ శివారులో విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట శిబిరంపై మంగళవారం రాత్రి మెరుపు దాడి చేసినట్లు కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.23,110 నగదు, 6 సెల్‌ఫోన్లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా పేకాడుతున్నట్లు సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. పేకాటతో నష్టపోయి జీవితాలను పాడు చేసుకోవద్దని, పేకాట వల్ల ఎన్నో జీవితాలు రోడ్డున పడ్డాయి అన్నారు. పేకాట ఆడుతూ పట్టుబడే పేకాట రాయుళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -