Tuesday, August 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం

గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం

- Advertisement -

నవతెలంగాణ – తొగుట 
గ్రామాభివృద్ధికి అందరు సహకరించాలని సర్పంచ్ రాంపురం రమేష్ అన్నారు. మంగళవారం మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో జిపిడిపి గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న సమస్యలను వీలై నంత త్వరగా పూర్తి చేస్తానని అన్నారు. పై అధికా రుల దృష్టికి తీసుకువెళ్తానని, గ్రామ అభివృద్ధి కి కృషి చేస్తానన్నారు. ఈ గ్రామసభలో ఉపసర్పంచ్ ఎండి గౌస్ బాషా, వార్డు సభ్యులు గౌరోల్ల సాయి కుమార్, నరేడ్ల బాల్ రెడ్డి, నిరటి నవనీత, బుర్ర భారతి, పంచాయతీ కార్యదర్శి జగన్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -