Wednesday, May 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన పైప్ లైన్ పనులు ప్రారంభం

నూతన పైప్ లైన్ పనులు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలో వేసవి దృష్ట్యా నెలకొన్న నీటి కొరతను తీర్చేందుకు చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ తెలిపారు. ఈ మేరకు గ్రామంలో నీటి కొరతతో ప్రజల ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో చేపడుతున్న కొత్త పైపులైన్ ఏర్పాటు కోసం భూమి తవ్వకం పనులను సర్పంచ్ పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొత్తపల్లి హారిక మాట్లాడుతూ గ్రామంలో వేసవికాలం నేలకొన్న నీటి కొరతను తీర్చేందుకు గొల్లపేట ఇందిరమ్మ కాలనీ నుండి గ్రామంలోని వాటర్ ట్యాంకుల వరకు కొత్త  పైపులైన్ వేయిస్తున్నట్లు తెలిపారు.

అందులో భాగంగా పైప్ లైన్ వేసేందుకు జెసిబి తో కాలువను తీసే పనులను ప్రారంభించినట్లు వివరించారు. త్వరితగతిన కొత్త పైపులైన్ పనులను పూర్తి చేసి గ్రామంలో నీటి కొరత లేకుండా సమస్యను పరిష్కరిస్తామన్నారు. నీటి సమస్యపై తక్షణమే స్పందించి నూతన పైపులైన్ పనులను ప్రారంభించిన సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, గొల్లపేట ఇందిరమ్మ కాలనీవాసులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -