కోల్ కతా నైట్ రైడర్స్ పై బెంగుళూరు
రాయ్ పూర్ : కోల్ కతా నైట్ రైడర్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)భారీ లక్ష్యాన్ని ఛేదించింది.కోల్ కతా నిర్దేశించిన 193పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు బ్యాటర్లు కోహ్లి(105నాటౌట్)సెంచరీకి తోడు పడిక్కల్(39)రాణించారు. దీంతో బెంగళూరు 19.1ఓవర్లలో కేవలం 4వికెట్లు కోల్పోయి 194పరుగులు చేసి గెలిచింది.కోల్ కతా బౌలర్లు కార్తీక్ త్యాగీకి మూడు,నరైన్ ఒక వికెట్ పడగొట్టారు.ఈ గెలుపుతో బెంగళూరు పాయింట్ల పట్టికలో మరోసారి అగ్రస్థానానికి ఎగబాకింది.అంతకుముందు కోల్ కతా బ్యాటర్ రఘువంశీ అర్ధ శతకంతో రాణించడంతో నిర్ణీత 20ఓవర్లలో4వికెట్ల నష్టానికి 192పరుగులు చేసింది.రఘువంశీ అర్ధ శతకానికి తోడు గ్రీన్(32),రింకు సింగ్(49నాటౌట్)బ్యాటింగ్ లో రాణించారు.బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్,హేజిల్ వుడ్,రసిక్ సలామ్ దర్ కు ఒక్కో వికెట్ దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లికి దక్కింది.
వర్షంతో టాస్ ఆలస్యం
భారీ వర్షం కారణంగా నిర్ణీత సమయానికి ప్రారంభం కావాల్సిన మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది.మ్యాచ్ ప్రారంభానికి ముందు రాయ్‌పూర్‌లోని భారీ వర్షం కురవడంతో షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం తడిసి మద్దయ్యింది.దీంతో టాస్ గంటన్నర ఆలస్యంగా వేశారు.అయితే,ఓవర్ల కుదింపు ఏమీ లేకుండానే మ్యాచ్ ప్రారంభమైంది.టాస్ గెలిచిన అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ…రొమారియో షెపర్డ్ స్థానంలో వెంకటేశ్ అయ్యర్,సుయాశ్ శర్మ స్థానంలో జాకబ్ డఫీ జట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు.కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ,తాము కూడా బౌలింగ్ చేయాలనే అనుకున్నా..కీలక స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమైనట్లు..అతని స్థానంలో సౌరభ్ దూబే అరంగేట్రం చేస్తున్నట్లు తెలిపాడు.
స్కోర్ బోర్డు…
కోల్ కతా నైట్ రైడర్స్ : రహానే(సి అండ్ బి)హేజిల్ వుడ్ 19,అలెన్(సి)జితేశ్ శర్మ (బి)భువనేశ్వర్ కుమార్ 18,రఘు వంశీ (రనౌట్)భువనేశ్వర్ కుమార్ 71,గ్రీన్(బి)రసిక్ సలామ్ ధర్ 32,రింకు సింగ్ (నాటౌట్) 49, అదనం3. (20 ఓవర్లలో4వికెట్ల నష్టానికి) 192 పరుగులు.
వికెట్ల పతనం: 1/23, 2/48, 3/116, 4/192
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 4-0-34-1,డఫీ4-0-48-0,హేజిల్ వుడ్ 4-0-35-1,రసిక్ సలామ్ దర్ 4-0-35-1,కృనాల్ పాండ్యా 4-0-39-0.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : బేథెల్(సి అండ్ బి)కార్తీక్ త్యాగీ 15,కోహ్లి(నాటౌట్) 105, పడిక్కల్(సి)రహానే(బి)కార్తీక్ త్యాగీ 39,రజత్ పటీధర్ (సి)రహానే(బి)నరైన్11,టిమ్ డేవిడ్ (సి)మనీష్ పాండే (బి)కార్తీక్ త్యాగీ 2,జితేశ్ శర్మ (నాటౌట్) 8, అదనం14. (19.1 ఓవర్లలో4వికెట్ల నష్టానికి) 194 పరుగులు.
వికెట్ల పతనం: 1/37, 2/129, 3/157, 4/180
బౌలింగ్:సౌరభ్ దూబే 2.1-0-21-0,వైభవ్ అరోరా 4-0-48-0,కార్తీక్ త్యాగీ 4-0-32-3,నరైన్4-0-31-1,గ్రీన్2-0-22-0,అనుకుల్ రాయ్ -0-36-0.



