Thursday, May 14, 2026
E-PAPER
HomeNewsప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో గురువారం విద్యా వారోత్సవాలు జరిగాయి. నాల్గవ రోజు కార్యక్రమంలో భాగంగా గౌరవ ప్రిన్సిపాల్ కె. అశోక్ ఆదేశాల మేరకు మోగా గ్రామ తల్లిదండ్రుల – ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగిందని కళాశాల లెక్చరర్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు గంగాధర్, విట్టల్, శివ, షేక్కు బాయి, సావిత్రి, కళాశాల ఉపాధ్యాయాలు ఈ కార్యక్రమానికి ఉద్దేశించి మాట్లాడుతూ.. కళాశాల ప్రగతి, విద్యార్థుల ఫలితాలను, విద్యార్థులు సాధించిన విజయాలు, వివరించారు. తల్లిదండ్రులు సూచించిన సలహాలు తప్పకుండా పాటిస్తామని తల్లిదండ్రుల సహాయ సహకారాలను ఎప్పటికీ అందించాలని కోరారు. అనంతరం హాజరైన విద్యార్థుల తల్లిదండ్రుల కు కళాశాల సిబ్బంది శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -