Thursday, May 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామీణాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి..

గ్రామీణాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి..

- Advertisement -

– ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్..
నవతెలంగాణ – ఊరుకొండ 
: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించిందని.. ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచేందుకు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తుందని.. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి గ్రామ అభివృద్ధి ద్యేయంగా ముందుకు వెళ్తున్నామని జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ లు అన్నారు.  

గురువారం జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం రాచాలపల్లి, రేవల్లి, గుడిగానిపల్లి గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఉదయం ఏడు గంటలకే గ్రామాలకు చేరుకుని అధికారులు గ్రామంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించి పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

గ్రామాల్లో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్, పనులు వేగంగా పూర్తి చేసి అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్మాణ సామగ్రి సరఫరా, సాంకేతిక సహాయం విషయంలో అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.

అనంతరం గ్రామాల్లో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనులను శాశ్వత పరిష్కారంగా చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా డ్రైనేజ్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేలా నాణ్యమైన నిర్మాణం చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

మిషన్ భగీరథ తాగునీటి సరఫరా వ్యవస్థను కూడా పరిశీలించిన కలెక్టర్, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు నిరంతరాయంగా అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా పైప్‌లైన్ వ్యవస్థను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో సీసీ రోడ్ల పనులను మంజూరుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల మెరుగుదల కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, ప్రజాధనం వృథా కాకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా గ్రామాల్లోకే వెళ్లి తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు.

ప్రభుత్వ పథకాల ద్వారా పేదలకు ఇళ్లు, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్య సౌకర్యాలు అందించడం ద్వారా గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని, అధికారులు ప్రజలతో సమన్వయంతో పనిచేసి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.

గ్రామ పర్యటన సందర్భంగా స్థానిక ప్రజలు పలు సమస్యలను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై స్పందించిన అధికారులు సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దేవ సహాయం, పీడీ హౌసింగ్ సంగప్ప, డీపీవో శ్రీరాములు, ఆర్డీవో జనార్దన్ రెడ్డి, తహసీల్దార్ యూసుఫ్ అలీ, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -