నవతెలంగాణ – ఆర్మూర్
డొంకేశ్వర్ మండలానికి నూతన తహసిల్దారుగా బదిలీపై వచ్చిన శ్రీ జి. ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసి, సన్మానించినట్టు అఖిల భారతీయ విశ్వకర్మ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ చారి, డొంకేశ్వర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు గణేష్ గౌడ్ లు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉండి పారదర్శకంగా పరిపాలన అందించాలని కోరారు. మండల అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి తహసిల్దార్‌గా సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.తహసిల్దార్ జి. ప్రసాద్ మాట్లాడుతూ, ప్రజల సహకారంతో ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ చేరేలా కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెవెన్యూ సేవలను వేగవంతంగా అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, విశ్వకర్మ సంఘ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు , మండల ప్రజలు పాల్గొన్నారు.
నూతన తహసిల్దార్‌కు సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



