Saturday, May 16, 2026
E-PAPER
Homeసోపతిఓ రాజ్యమా!

ఓ రాజ్యమా!

- Advertisement -

ఇదిగో..
వినిపిస్తోందా నా గావుకేక..!
తట్టుకోలేని ఈ శబ్దాన్ని ఆపేందుకు
నా గొంతు నులమాలని చూస్తావా?
నా మౌన నిరసన ప్రళయ ఘోషకన్నా
ఎన్నోరెట్లు ప్రతిధ్వనిస్తుంది తెలుసా!
పిడికిలి బిగించిన నా చేతిని ఒక్కవేటుతో నరికేద్దామని చూస్తావా?
వేళ్లులేని ఆ మొండి చేయి మరింత పదును సంతరించుకుంటుంది తెలుసా!
పరిగెత్తే కాళ్ల మీద అమాంతం రక్తాలు కారేట్టు
కర్రలతో గట్టిగా బాది, పరుగును ఆపుదామని చూస్తావా?
ఈ బలహీనమైన నా దేహాన్ని, బలమైన నా దేశాన్ని..
నడవలేని మోకాళ్ళతో ఈడ్చుకుంటూ మరింత వడివడిగా
ముందుకు కదిలిస్తాను తెలుసా!
అయినా.. సమైక్యతా రాగాల మానస వీణ తంత్రులను
నీ స్వార్థ విష ప్రయోజనాల కత్తులతో చిదిమివేసి,
వికటాట్టహాసం చేద్దామనుకుంటున్నావా?
నేను… దిగంబరుడినైన నా చుట్టూ వీచే గాలిలోనే నిశ్శబ్దపు నినాదాలతో
తిరుగుబాటు తుపానులు కురిపించి,
ఇనుప పదఘట్టనల కింద నలిగిపోయిన
ఎన్నో మెత్తని మకరందపు పూబాలలను చిగురింపజేస్తా!
పసి కన్నుల కలలన్నీ ఈ జన్మలోనే నిజరూపు దాల్చేట్లు
డప్పులు, గజ్జెలు, కొమ్ముబూరలతో
ప్రజాకళలకు పునర్వైభవం కల్పింపజేస్తా!!
కల్లోల జగతిలో మందార, మహువాలను పూయించి,
ఆకలిదప్పులు తీర్చే మధుర గానాలను సజియింపజేస్తా!!!
– గిరిధర్‌, 9849801947

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -