Saturday, May 16, 2026
E-PAPER
Homeసోపతినిజమైన విజయం

నిజమైన విజయం

- Advertisement -

నేటి యుద్ధం
కత్తులు, ఖడ్గాలు కాదు
బాంబుల గర్జనలతో
భూమి వణికే సమరం.
మైదానాలపై కాదు
నగరాల మధ్యలోనే యుద్ధం.
పిల్లల నవ్వుల మధ్య
గర్జించే తుపాకుల శబ్దం.
వీరుల గాథలకంటే
వేదనల కథలే ఎక్కువ
గెలుపు ఎవరిదో తెలియదు
ఓటమి మాత్రం మానవత్వానిదే.
పొగమంచు మధ్యలో
కనిపించేది కన్నీరు మాత్రమే
యుద్ధం ముగిసిన తర్వాత కూడా
గాయాలు మిగిలే ఉంటాయి.
శాంతి అనే పదం
పుస్తకాలలో కాదు
మన హదయాలలో పుడితేనే
నిజమైన విజయం వస్తుంది.
గెలవడం అంటే
వేరొకరిని ఓడించడం కాదు,
కోల్పోతున్న విజ్ఞతను
ప్రేమను సంపాదించుకోవడం

తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి,
8008 577 834

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -