Friday, May 15, 2026
E-PAPER
Homeనిజామాబాద్కొనుగోలు కేంద్రాన్ని సంద‌ర్శించిన తహసిల్దార్

కొనుగోలు కేంద్రాన్ని సంద‌ర్శించిన తహసిల్దార్

- Advertisement -

నవతెలంగాణ-డిచ్‌పల్లి: ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి, వెంగల్ పాడ్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం తహసిల్దార్ గుర్రం బాలయ్య ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులు పడుతున్న ఇబ్బందులు తదితర విషయాలను, రైతులకు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జీ లను అడిగి తెలుసుకుని జిల్లా స్థాయి అధికారులకు కొనుగోలు,లారిలు, రైస్ మిల్లర్లు తదితర వాటిపై ఫోన్లో వివరించారు. ధాన్యాన్ని వెంటది వెంట కంట చేస్తూ లారీలలో ధాన్యాన్ని కేటాయించిన రైస్ మిల్లుకు తరలించే విధంగా చూడాలని కేంద్రాల ఇన్చార్జి లను ఆదేశించారు. ఆయా కేంద్రాలలో ఉన్న స్థితిగతులపై అధికారులకు వివరిస్తామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని వివరించారు. ఈ కార్యక్రమంలో జిపిఓ రైతులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -