Saturday, May 16, 2026
E-PAPER
Homeసినిమా‘పెద్ది’లో రామ్ బుజ్జిగా దివ్యేందు శర్మ

‘పెద్ది’లో రామ్ బుజ్జిగా దివ్యేందు శర్మ

- Advertisement -

హీరో రామ్ చరణ్ నటిస్తున్న రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో నిర్మాత వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ‘పెద్ది’ని భారతీయ సినిమాకు కొత్త అనుభూతిని ఇచ్చే విజువల్ స్పెక్టకిల్‌గా రూపొందించారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్‌ను ఈనెల 18న ముంబైలో గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు. ఈలోగా మేకర్స్ మరో సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రంలో మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ పోషిస్తున్న పవర్‌ఫుల్ పాత్ర ‘రామ్ బుజ్జి’ని పరిచయం చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. క్రికెట్ మైదానంలో రామ్ బుజ్జి ఎంట్రీ ఇచ్చిన తీరు, అతని బాడీ లాంగ్వేజ్, రగ్గడ్ యాటిట్యూడ్ పాత్రలోని ఇంటెన్సిటీని బలంగా చూపించాయి. దివ్యేందు శర్మ స్క్రీన్ ప్రెజెన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కలిసి వీడియోకి మాస్ వైబ్ తీసుకొచ్చాయి. దీంతో రామ్ బుజ్జి పాత్ర సినిమా కథలో ఎంత కీలకంగా ఉండబోతోందోనన్న ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగింది. ‘పెద్ది’ జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, జూన్ 3న ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -