Saturday, May 16, 2026
E-PAPER
Homeసినిమాపర్సంటేజీ విధానానికి నిర్మాతలు సానుకూల స్పందన

పర్సంటేజీ విధానానికి నిర్మాతలు సానుకూల స్పందన

- Advertisement -

‘పెద్ది` రిలీజ్ విషయంలో ఎటువంటి సందేహాలు వద్దు : దిల్ రాజు

ఎటువంటి ఇబ్బందులు లేకుండా ‘పెద్దిసినిమా జూన్‌ 4న ఆరోగ్యకర వాతావరణంలోనే విడుదలవుతుందని, ఆ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని నిర్మాత దిల్‌ రాజు తెలిపారు. నిర్మాత, ప్రదర్శన, పంపిణీ రంగాలకు చెందిన సభ్యుల సంయుక్త సమావేశం శుక్రవారం ఉదయం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగింది. ఈ సమావేశంలో ప్రదర్శక రంగానికి సంబంధించిన 'శాతాల విధానం' పై చర్చించారు. ఈ సమస్యకు ఒక సముచిత పరిష్కారం కనుగొనేందుకు, శాతాల వివాదాన్ని త్వరితగతిన పరిష్కరించేందుకు గాను ఒక ఉప కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ఉప కమిటీ తన విధులను నిర్మాతలు డి. సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు, కె. ఎల్. నారాయణ, కె. అశోక్ కుమార్ మార్గదర్శకత్వంలో నిర్వర్తిస్తుంది. తదనుగుణంగా నిర్మాత, ప్రదర్శక, పంపిణీ రంగాల సభ్యులతో కూడిన పై ఉప కమిటీకి నిర్మాణ రంగం నుంచి వై. సురేందర్ రెడ్డి, వై. సుప్రియ, వై. రవి శంకర్, బి. బాపినీడు, చెరుకూరి సుధాకర్, జి. శ్రీనివాస్ కుమార్, టి. ప్రసన్న కుమార్, అలాగే ప్రదర్శన రంగం నుంచి వి. ప్రతాప్ రెడ్డి, టి. బాల్గోవింద్ రాజ్, కె. అనుపమ్ రెడ్డి, పి. శ్రీనివాస రావు, జి. వీరనారాయణ బాబు, కె. వంశీ కిషోర్ (చిన్ని), ఎం. విజేందర్ రెడ్డి, పంపిణీ రంగం నుంచి డి. విష్ణు మూర్తి, వి. వీరనాయుడు, ఎన్. సుధాకర్ రెడ్డి, ముత్యాల రామదాసు, ఎన్. నాగార్జున, బి. మధుసూదన్ రెడ్డి (ఠాగూర్ మధు), శ్రీ ధీరజ్ మొగిలేని సభ్యులుగా నామినేట్ చేయాలని నిర్ణయించారు. ఈ సభ్యులందరూ రెండు నెలల్లో ఒక నివేదిక ఇవ్వాలని ఫిల్మ్ ఛాంబర్ ఆదేశించింది. ఈ సమావేశం అనంతరం దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ,'ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య ఫిల్మ్‌ ఛాంబర్‌లో మీటింగ్‌ జరిగింది. సమస్యలపై చర్చించి, పరిష్కరించుకున్నాం. ఎగ్జిబిటర్లు కోరుతున్న పర్సంటేజీ విధానానికి నిర్మాతలు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ఓ కమిటీ ఏర్పాటుకానుంది. ఏ, బీ, సీ.. ఇలా ఆయా సెంటర్లలోని థియేటర్‌ను బట్టి పర్సంటేజీని కమిటీ నిర్ణయిస్తుంది అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -