- Advertisement -
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
- తాటి వనంలో తాటి కల్లు స్వీకరించిన ప్రభుత్వ విప్
- నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
- ప్రజల జీవనోపాధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం, యాదగిరిగుట్ట మండలం దాతరపల్లి గౌడ్ అన్నలు తమ తాటి చెట్ల వద్దకు వెళ్లేందుకు సౌకర్యంగా ఉండేందుకు రోడ్డును మరమ్మతులు చేసిన సందర్భంగా ఆయన ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గౌడ్ అన్నలు ఏర్పాటు చేసిన స్వాగతాన్ని స్వీకరించిన ఆయన, తాటి వనంలో సంప్రదాయ సురా పానకం (కల్లు)ను స్వీకరించారు. అనంతరం గౌడ్ వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు,వారి సాధకబాధలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.గౌడ్ అన్నల సంక్షేమానికి అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జంగంపల్లి సర్పంచ్ పారునంది కృష్ణ, కాల్నే భాస్కర్, తుమ్మల నాగరాజు గ్రామ పెద్దలు, గౌడ్ సంఘ నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



