Saturday, May 16, 2026
E-PAPER
Homeక్రైమ్షార్ట్ సర్క్యూట్‌తో గడ్డివాము దగ్ధం

షార్ట్ సర్క్యూట్‌తో గడ్డివాము దగ్ధం

- Advertisement -

300–400 మోపుల నష్టం.. 
రైతును ఆదుకోవాలని స్థానిక నాయకుల విజ్ఞప్తి
నవతెలంణ – ఆలేరు రూరల్

ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో ఈరోజు  మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో రైతు గంగరాజు రామకృష్ణకు చెందిన గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. గ్రామంలోని వ్యవసాయ బావి సమీపంలో మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో 11 కేవీ విద్యుత్ లైన్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు.ఈ ప్రమాదంలో సుమారు 300 నుంచి 400 గడ్డిమోపులు అగ్నికి ఆహుతైనట్లు బాధిత రైతు గంగరాజు రామకృష్ణ తెలిపారు. సుమారు 50 వేల నష్టం జరిగిందని రైతు కన్నీరు పెట్టుకున్నారు.తక్షణమే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎస్సై అబ్దుల్ రహీం పర్యవేక్షణలో, అగ్నిమాపక సిబ్బంది వలిగొండ శ్రీకాంత్ నేతృత్వంలో సహాయక చర్యలు చేపట్టి మంటలు మరింత వ్యాపించకుండా అడ్డుకున్నారు.ప్రమాద స్థలాన్ని కొల్లూరు గ్రామ సర్పంచ్ జనగాం సుధారాణి  శ్రీపాల్ రెడ్డి,ఉప సర్పంచ్ గాజుల దశరథ్,మాజీ ఎంపీటీసీ కోరుకొప్పుల కిష్టయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జనగాం శ్రీపాల్ రెడ్డి తదితరులు పరిశీలించి బాధిత రైతుకు ధైర్యం చెప్పారు.టీపీడీసీఎల్ సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాకీ యోహాన్, గ్యాదపాక మధు, బీజేపీ నాయకులు కాండ్రాజు శ్రీనివాస్, కాండ్రాజు రాజా, నర్సింహులు, కాన్రాజ్ వేణు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -