Sunday, May 17, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మూడు నెలలు నిర్మాణ ప‌నులు.. ఉప్పల్ రింగ్ రోడ్ మూసివేత

మూడు నెలలు నిర్మాణ ప‌నులు.. ఉప్పల్ రింగ్ రోడ్ మూసివేత

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ రింగ్ రోడ్డు చౌరస్తాను నేటి నుంచి తాత్కాలికంగా మూసివేశారు. ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కోసం మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.

రామంతాపూర్, హబ్సీగూడ నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు పిస్తా హౌస్, లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనుక నుంచి బీరప్పగూడ మీదుగా వరంగల్ జాతీయ రహదారిని చేరుకునే మళ్లింపు చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీ కార్యాలయం పక్కనున్న వరంగల్ బస్టాప్‌ను ఇప్పటికే నల్లచెరువు కట్ట వద్దకు మార్చిన సంగతి తెలిసిందే.

నాగోల్, ఎల్బీనగర్ వైపు నుంచి వరంగల్ వెళ్లే వాహనాలు హయత్‌నగర్ మీదుగా పెద్ద అంబర్‌పేట వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై నుంచి లేదా సర్వీస్ రోడ్డు మార్గాన ఘట్‌కేసర్ వద్ద వరంగల్ జాతీయ రహదారికి చేరుకోనున్నాయి.

ఫీర్జాదిగూడ వైపు నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు ఉప్పల్ జంక్షన్ రాకముందు ఉన్న లక్ష్మారెడ్డి కాలనీ మీదుగా ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న మాస్టర్ చెఫ్ రెస్టారెంట్ చేరుకుని, అక్కడ యూటర్న్ తీసుకుని సికింద్రాబాద్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఫీర్జాదీగూడ నుంచి నాగోలు వెళ్లాంటే ఉప్పల్ భగాయత్ లేఅవుట్ ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది. నాగోలు నుంచి వరంగల్ వైపు వాహనాలు కూడా భగాయత్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. హబ్సీగూడ నుంచి నాగోలు వైపు వెళ్లే వాహనాలకు ఎలాంటి ఆంక్షలు లేవు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -