Tuesday, May 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌చిన్నపత్రికలు, డెస్క్‌ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు పెంచాలి

‌చిన్నపత్రికలు, డెస్క్‌ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు పెంచాలి

- Advertisement -

సమాచార శాఖ స్పెషల్‌ కమిషనర్‌‌కు టీబ్ల్యూజేఎఫ్‌ వినతి
‌నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

రాష్ర్టవ్యాప్తంగా చిన్న పత్రికలకు ప్రింటింగ్‌ ఎడిషన్ల వారీగా అక్రిడిటేషన్‌ ‌కార్డులు పెంచాలని తెలంగాణ వర్కింగ్‌ ‌జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌(‌టీడబ్ల్యూజేఎఫ్‌) ‌రాష్ర్ట కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేసింది. అలాగే డెస్క్‌ ‌జర్నలిస్టులకు ప్రింటింగ్‌ ఎడిషన్లతోపాటు జిల్లా కేంద్రాల్లో కూడా అక్రిడిటేషన్లు కేటాయించాలని సూచించింది. అక్రిడిటేషన్ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌‌లో రాష్ర్ట సమాచార, పౌరసంబంధాల శాఖ స్పెషల్‌ ‌కమిషనర్‌ ‌జి ముకుందరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల ఇండ్లస్థలాలు, అక్రిడిటేషన్ల హెల్త్ కార్డులపై సుదీర్ఘంగా చర్చించారు. చిన్న పత్రికలకు సంబంధించి ఉమ్మడి జిల్లాల వారీగా పబ్లీకేషన్‌ ‌కేంద్రాల్లో నియోజకవర్గానికి రెండు అక్రిడిటేషన్‌ ‌కార్డులు జారీ చేయాలని సూచించారు. ఈవిషయమై జర్నలిస్టు సంఘాలతో జరిగిన సమావేశంలో రాష్ర్ట సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఈ సందర్భంగా పూర్తి వివరాలతో కూడిన వినతిపత్రం సమర్పించినట్టు గుర్తు చేశారు. ఈ మేరకు చిన్నపత్రికలకు సహకరించాలని సూచించారు. అలాగే అక్రిడిటేషన్ల జీవోలను సవరించి చిన్నపత్రికలకు అక్రిడిటేషన్లు జారీచేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలావుండగా డెస్క్‌ ‌జర్నలిస్టులకు సంబంధించి అదనంగా కార్డులు ఇవ్వాలని కోరారు. ప్రింటింగ్‌ ‌కేంద్రాలతోపాటు జిల్లాల కేంద్రాల్లో పనిచేసే డెస్క్‌ ‌జర్నలిస్టులకూ అక్రిడిటేషన్‌ ‌కార్డులు కేటాయించాలని స్పెషల్‌ ‌కమిషనర్‌‌కు విన్నవించారు. ఈ మేరకు డెస్క్‌ ‌జర్నలిస్టుల విధులు, వారు ఎక్కడెక్కడి నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తారో ఆయన దృష్టికి తెచ్చారు. అలాగే రాష్ర్ట స్థాయి, జిల్తా స్థాయి అక్రిడిటేషన్‌ ‌సమావేశాలకు కార్మిక శాఖ గుర్తించి, ఇచ్చిన ఆదేశాల ప్రకారం యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ ‌పి రాంచందర్‌, ప్రధానకార్యదర్శి బి. బసవపున్నయ్య నేతృత్వంలోని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ‌ఫెడరేషన్‌(‌టీడబ్ల్యూజేఎఫ్‌)‌నే కోర్టు తీర్పు వచ్చేవరకు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని కోరారు. ఈ మేరకు సమస్యల పరిష్కారానికి స్పెషల్‌ ‌కమిషనర్‌ ‌హామినిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్‌ ‌రాష్ర్ట ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఉపాధ్యక్ష‍ులు తాటికొండ కృష్ణ, బి. రాజశేఖర్‌, కార్యదర్శులు ఈ చంద్రశేఖర్‌, గండ్ర నవీన్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -