Tuesday, May 19, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..నిరుద్యోగులకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..నిరుద్యోగులకు గుడ్ న్యూస్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వయోపరిమితిని మరో పదేళ్లకు పెంచింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం సాధారణ ఉద్యోగాల కోసం గరిష్ట వయోపరిమితి 34 సంవత్సరాలుగా ఉంది. కాగా, తాజా ఉత్తర్వులతో ఈ వయోపరిమితి 44 ఏళ్లకు పెరిగింది. ఈ వయో సడలింపు ఏడాది పాటు అమలులో ఉండనుంది. నిరుద్యోగ యువత నుంచి పెద్ద ఎత్తున వినతులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా కాలం, నియామకాల ఆలస్యం, నోటిఫికేషన్లు లేకపోవడం వంటి పలు కారణాల వల్ల చాలామంది నిరుద్యోగులు వయోపరిమితి దాటిపోయారని.. వారికి మరో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

రాష్ట్రంలోని వివిధ నియామక సంస్థలు విడుదల చేసే నోటిఫికేషన్లకు ఈ వయోసడలింపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో తెలిపారు. అయితే ఈ సడలింపు యూనిఫాం సర్వీసులకు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేశారు. పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైలు, అటవీ శాఖల వంటి శారీరక ప్రమాణాలు అవసరమైన ఉద్యోగాలకు ఈ వయోపరిమితి పెంపు వర్తించదని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -