Wednesday, June 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా బోనాల పండుగ

ఘనంగా బోనాల పండుగ

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి
మండల పరిధిలోని చల్లగరిగే గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ రేణుక మాత ఎల్లమ్మ వారోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. గౌడ సంఘం కు చెందినమహిళలు ఇంటికొక బోనాలను తలపై ఎత్తుకొని ప్రధాన వీధుల గుండా వెళ్తూ ఎల్లమ్మ ఆలయానికి చేరుకొని బోనాలను సమర్పించి, మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ.. గౌడ సంఘం కుటుంబ సభ్యులతో పాటు, గ్రామస్తులందరు, పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండే విధంగా చూడాలని మొక్కుకున్నట్లు వారు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -