Tuesday, May 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డా.భూపతి రెడ్డి నియామకం గల్ఫ్ బాధితులకు కొండంత అండ

డా.భూపతి రెడ్డి నియామకం గల్ఫ్ బాధితులకు కొండంత అండ

- Advertisement -

జిల్లా కాంగ్రేస్ పార్టీ అధికార ప్రతినిధి చెలిమేల నర్సయ్య 
నవతెలంగాణ – దర్పల్లి

తెలంగాణ ప్రభుత్వం ఎన్నారై పాలసీ పథకం అమలు అడ్వైజర్ కమిటీ లో నిజామాబాదు రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డిని నియమించడం గల్ఫ్ బాధితులకు, ఎన్నారై బాధిత కుటుంబాలకు న్యాయం చేకూరుతుందని భావిస్తున్నామని జిల్లా కాంగ్రేస్ పార్టీ అధికార ప్రతినిధి చెలిమేల నర్సయ్య అన్నారు. మంగళవారం అయన మీడియతో మాట్లాడుతూ..రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే  డాక్టర్ భూపతి రెడ్డి మొదట రాజకీయ రంగ ప్రవేశం సందర్భంలో, తెలంగాణ ఉద్యమంలో గల్ఫ్ బాధితులే ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. గల్ఫ్ బాధితుల  గురించి పూర్తిస్థాయిలో తెలుసుకున్న నాయకులలో డాక్టర్ భూపతిరెడ్డి ఒక్కరు. ఇలాంటి నేతకు అడ్వైజర్ కమిటీలో సభ్యులుగా ఉంచడం గల్ఫ్ బాధితులకు కొండంత అండగా ఉంటుందని తెలియజేస్తున్నానన్నారు.

పేద ప్రజలు అట్టడుగు వర్గాల పై అవగాహన కలిగిన నేతగా, ముఖ్యంగా గల్ఫ్ కార్మికులు వారి  శ్రేయస్సుపై అవగాహన ఉండి, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్న భూపతి రెడ్డికి స్థానం కల్పించడం హర్షనీయం అని అన్నారు. మంగళవారం  హైదరాబాదులోని ప్రజాభవన్ నుండి ఆంధ్ర ప్రదేశ్ లో రెండు రోజులపాటు పర్యటించడానికి వెళుతున్న డాక్టర్ భూపతి రెడ్డికి గల్ఫ్ బాధితులు అక్కడి గల్ఫ్ బాధితులు స్వాగతం పలికి వారి సమస్యలను విన్నవించుకునే విధంగా వారితో అండగా ఉంటారని అశభవం వెక్తం చేశారు. తెలంగాణ ప్రజా భవన్ నుండి మొదటిసారి గల్ఫ్ బాధిత కుటుంబాలను, వారి సాధకబాధకులను తెలుసుకోవడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అక్కడి ఎన్నారై మంత్రిత్వ శాఖ ఆహ్వానించడం శుభ పరిణామామని తెలియజేస్తున్నామని అన్నారు.

ఆ శాఖ మంత్రివర్యులు అదేవిధంగా అడ్వైజర్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ సభ్యులు ఆంధ్రప్రదేశ్లో పర్యటించడం గల్ఫ్ బాధితులకు కొండంత అండగా నిలుస్తుందన్న నమ్మకం ఉంది గల్ఫ్ బాధితులకు ప్రమాద బీమా మరియు 24 గంటలు హెల్ప్ లైన్ ఏర్పాటు అమలు చేయడం ఏర్పాటు చేయడం వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేస్తున్నానని అన్నారు. ఎన్ఆర్ఐ పాలసీ అమలులో అడ్వైజర్ కమిటీ మరింత ముందుకు సాగాలని కోరారు. ఈ కమిటీలో అనుభవాగ్నులు ఉండడం నియమించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనమని తెలియజేశారు. డాక్టర్ భూపతిరెడ్డి 2001 నుండి నిజాంబాద్ జిల్లాలో గల్ఫ్ బాధిత కుటుంబాలను ఆదుకునే పాత్రలో ముందు నిలిచారని వైద్య సేవల ద్వారా కూడా వారి కుటుంబాలకు సేవలందించారని, మునుముందు మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -