Tuesday, May 19, 2026
E-PAPER
HomeNewsఅమోజన్ all-new Fire TV Stick HD విడుదల

అమోజన్ all-new Fire TV Stick HD విడుదల

- Advertisement -
  • – ఈ all-new Fire TV Stick HD, గత తరానికన్నా సగటున 30% పైగా వేగవంతమైన పనితీరును, Wi-Fi 6 మద్దతుతో ఫుల్ హెచ్‌డి స్ట్రీమింగ్‌ను అందిస్తుంది.
  • ఇది Amazon ఇప్పటివరకు ఉన్న అత్యంత పోర్టబుల్ స్ట్రీమింగ్ స్టిక్- ఫైర్ టీవీ శ్రేణిలోని ఇతర స్టిక్‌ల 30% సన్నగా ఉంటుంది; దీనికి వాల్ అడాప్టర్ అవసరం లేకుండా, టీవీ యూఎస్‌బీ  పోర్ట్ ద్వారా పవర్ అందించవచ్చు.
  • – all-new Fire TV Stick HD, వేగవంతమైన, మరింత వ్యవస్థీకృతమైన కొత్త ఫైర్ టీవీ అనుభవంతో వస్తుంది. దీనితో వినియోగదారులకు సెర్చ్ చేసేందుకు తక్కువ సమయం, స్ట్రీమింగ్ చేసేందుకు ఎక్కువ సమయాన్ని వినియోగించుకునేందుకు సహాయపడుతుంది.
  • – వినియోగదారులు all-new Fire TV Stick HDని Amazon.in, Blinkit, Flipkart, Swiggy Instamart, మరియు Zepto లలో ₹4,999 కు కొనుగోలు చేయవచ్చు. ఇది త్వరలో రిటైల్ స్టోర్లలో కూడా అందుబాటులోకి రానుంది.
  • నవతెలంగాణ – హైదరాబాద్: Amazon భారతదేశంలో all-new Fire TV Stick HDని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది Amazon ఇప్పటివరకు అందుబాటులోకి తీసుకువచ్చిన అత్యంత వేగవంతమైన HD స్ట్రీమింగ్ స్టిక్. ఇది గత తరం కన్నా సగటున 30% పైగా వేగవంతమైన పనితీరును అందిస్తుంది. ఇది వినియోగదారులకు HDR10+ మరియు Wi-Fi 6 సపోర్ట్‌తో ఫుల్ HD స్ట్రీమింగ్‌ను, మరింత సన్నని, సులభంగా తీసుకువెళ్లగలిగే డిజైన్‌ను, వేగవంతమైన, మరింత వ్యవస్థీకృత నావిగేషన్ కోసం పునఃరూపకల్పన చేయబడిన కొత్త ఫైర్ టీవీ అనుభవాన్ని అందిస్తుంది. Fire TV Stick HDతో, వినియోగదారులు వివిధ కంటెంట్ ప్రొవైడర్ల నుంచి లక్షలాది సినిమాలను, టీవీ ఎపిసోడ్‌లను స్ట్రీమ్ చేసుకోవచ్చు. కన్సోల్ అవసరం లేకుండా Xbox క్లౌడ్ గేమింగ్‌ను ఆస్వాదించవచ్చు (సబ్‌స్క్రిప్షన్ ఫీజులు వర్తించవచ్చు).

“వినియోగదారులు తమ టీవీ స్ట్రీమింగ్ అనుభవాన్ని వేగంగా, స్పందనతో ఉండాలని ఆశిస్తారు- యాప్‌లు త్వరగా లోడ్ అవ్వడం, కంటెంట్ సులభంగా దొరకడం, స్ట్రీమింగ్ సజావుగా, లాగ్ లేకుండా ఉండాలని కోరుకుంటారు. మా all-new Fire TV Stick HD సరిగ్గా అదే అందిస్తుంది. ఇది మునుపటి తరం కన్నా సగటున 30% పైగా వేగవంతమైనది. అలాగే, నిరంతరాయ స్ట్రీమింగ్ కోసం మా నూతన, వేగవంతమైన ఫైర్ టీవీ ఇంటర్‌ఫేస్‌తో వస్తుంది. ఇది మా ఇప్పటివరకు ఉన్న ఫైర్ టీవీ స్టిక్‌లలోకెల్లా అత్యంత సన్ననిది. దీన్ని సులభంగా ఎక్కడికైనా తీసుకువెళ్లవచ్చు. ఇది టీవీ వెనుక చక్కగా అమరి, చిందరవందర లేని సెటప్‌ను అందిస్తుంది’’ అని Amazon India, ఫైర్ టీవీ హెడ్ సయంతని చౌధురి తెలిపారు. ‘పనితీరు నుంచి డిజైన్ వరకు, వేగవంతమైన, సున్నితమైన, సౌకర్యవంతమైన స్ట్రీమింగ్ అనుభవాన్ని అందించడానికి మేము ఈ పరికరాన్ని రూపొందించాము. భారతదేశంలోని మా వినియోగదారులకు దీనిని అందించడానికి మేము సంతోషిస్తున్నాము’ అని వివరించారు.

వేగవంతమైన యాప్ లాంచ్‌లతో పాటు, వేగవంతమైన HD స్ట్రీమింగ్ పనితీరును ఆస్వాదించండి

గత HD మోడళ్లతో పోలిస్తే, Fire TV Stick HD వేగంలో గుర్తించదగిన మెరుగుదలను అందిస్తుంది. ఇది గత తరం కన్నా సగటున 30% కన్నా ఎక్కువ వేగవంతమైనది. అంటే, ఇది వేగంగా ఆన్ అవడంతో పాటు యాప్‌లను మరింత త్వరగా తెరుస్తుంది. ఇది HDR10+తో 1080p ఫుల్ HD స్ట్రీమింగ్‌కు యాక్సెస్‌ను అందిస్తుంది. నెమ్మదైన ఇంటర్నెట్ కనెక్షన్‌లతో కూడా నమ్మకమైన, మెరుగైన నాణ్యత ఉన్న వీడియో స్ట్రీమింగ్ కోసం బ్లూటూత్ 5.3 సపోర్ట్ మరియు Wi-Fi 6తో వస్తుంది.

ఇప్పటివరకు ఉన్న ఫైర్ టీవీ స్టిక్‌లలోనే అత్యంత సన్ననిది. దీనితో స్ట్రీమింగ్ అనుభవాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు

all-new Fire TV Stick HD అనేది Amazon నుంచి అందుబాటులోకి వచ్చిన అత్యంత సన్నని స్ట్రీమింగ్ స్టిక్- ఫైర్ టీవీ శ్రేణిలోని ఇతర స్టిక్‌ల కన్నా సుమారు 30% సన్నగా ఉంటుంది. దీనికి డైరెక్ట్ పవర్ ద్వారా టీవీ USB పోర్ట్ ద్వారా పవర్ ఇవ్వవచ్చు. దీనితో వాల్ అడాప్టర్ అవసరం లేకుండా టీవీ వెనుక మరింత చక్కగా అమరుతుంది. ఈ కొత్త పరికరం క్యారీ-ఆన్ బ్యాగ్‌లో లేదా చిన్న జేబుల్లో సులభంగా ఇమిడిపోయేలా రూపొందించారు. తద్వారా వినియోగదారులు ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా దీనిని తమతో పాటు తీసుకువెళ్లి, తమకు ఇష్టమైన కంటెంట్‌ను స్ట్రీమ్ చేసుకోవచ్చు. 

సెర్చ్‌కు తక్కువ సమయం, స్ట్రీమింగ్‌కు ఎక్కువ సమయం వెచ్చించండి

Fire TV Stick HD కొత్త ఫైర్ టీవీ అనుభవంతో వస్తుంది. ఇది సినిమాలు, టీవీ షోలు, ఉచిత, లైవ్ కంటెంట్ కోసం ప్రత్యేక వర్గాలతో, మరింత స్పష్టంగా, వేగంగా, మరింత మెరుగ్గా వ్యవస్థీకృతంగా ఉండేలా పునఃరూపకల్పన చేయబడింది. ఇది వినియోగదారులు తాము చూడాలనుకున్న వాటిని వేగంగా వీక్షించేందుకు సహాయపడుతుంది. ఇది ఇంటర్‌ఫేస్‌లోనే స్మార్ట్ హోమ్ నియంత్రణలను సులభంగా అందుబాటులోకి తెస్తుంది. తద్వారా ఏసీలు, గీజర్లు, ఫ్యాన్లు మరియు లైట్ల వంటి Alexa-compatible స్మార్ట్ ఉపకరణాలను నిర్వహించడం, ఆపరేట్ చేయడం సౌకర్యవంతంగా ఉంటుంది.

2026 ప్రారంభంలో, Amazon భారతదేశంలో తన పునఃరూపకల్పన చేసిన, ఫైర్ టీవీ మొబైల్ యాప్‌ను కూడా విడుదల చేసింది. ఈ అప్‌డేట్ చేసిన యాప్, వినియోగదారులను వారి స్మార్ట్‌ఫోన్‌ల నుండే నేరుగా కంటెంట్‌ను బ్రౌజ్ చేయడానికి, డిస్కవర్ చేసేందుకు, ప్రయాణంలో వారి వాచ్‌లిస్ట్‌ను మేనేజ్ చేసుకునేందుకు, వారి టీవీలో టైటిల్స్‌ను రిమోట్‌గా ప్లే చేయడానికి అనుమతిస్తుంది- ఇవన్నీ కొత్త ఫైర్ టీవీ ఇంటర్‌ఫేస్‌కు సరిపోయే సరికొత్త రూపం మరియు అనుభూతితో వస్తాయి.

అన్ని రకాల వినోదాన్ని ఒకే చోట సులభంగా పొందండి

Fire TV Stick HDతో, వినియోగదారులు యాప్‌స్టోర్‌లోని Prime Video, Netflix, JioHotstar, YouTube, Zee5 వంటి వేలాది యాప్‌లలో లక్షలాది సినిమాలు మరియు టీవీ షో ఎపిసోడ్‌లను యాక్సెస్ చేయవచ్చు (సబ్‌స్క్రిప్షన్ రుసుములు వర్తించవచ్చు). వారు ఉచిత/ప్రకటనల మద్దతు ఉన్న కంటెంట్‌ను కూడా ఆస్వాదించవచ్చు. ఇందులో క్రీడా మ్యాచ్‌లు, వార్తలు వంటి ప్రత్యక్ష ప్రసార కంటెంట్ కూడా ఉంటుంది. Alexa Voice Remote, Alexa కు వాయిస్ కమాండ్‌ల ద్వారా లేదా రిమోట్‌లోని ప్రీ-సెట్ బటన్‌లను ఉపయోగించడం ద్వారా కంటెంట్‌ను కనుగొనడం మరియు ప్రారంభించడాన్ని సరళం చేస్తుంది.

Fire TV Stick HD మొదటిసారిగా ఫైర్ టీవీ HD స్ట్రీమింగ్ పరికరాలకు క్లౌడ్ గేమింగ్‌ను కూడా అందిస్తోంది. దీనితో వినియోగదారులు ఎలాంటి కన్సోల్ అవసరం లేకుండానే తమకు ఇష్టమైన ఎక్స్‌బాక్స్ గేమ్‌లను ఆస్వాదించవచ్చు. ఈ కొత్త స్ట్రీమింగ్ స్టిక్‌ను అనుకూలమైన బ్లూటూత్-ఎనేబుల్డ్ కంట్రోలర్‌తో జత చేయడం ద్వారా, వినియోగదారులు ఫైర్ టీవీ స్టిక్ HDలోని Xbox app ద్వారా నేరుగా వందలాది క్లౌడ్-ఎనేబుల్డ్ గేమ్‌లను యాక్సెస్ చేసి ఆడవచ్చు (దీనికి Xbox గేమ్ పాస్ సబ్‌స్క్రిప్షన్ అవసరం).

ధర మరియు లభ్యత

వినియోగదారులు Fire TV Stick HD ని Amazon.in, Blinkit, Flipkart, Swiggy Instamart మరియు Zepto లలో ₹4,999 కి కొనుగోలు చేయవచ్చు. ఇది త్వరలో రిటైల్ స్టోర్లలో కూడా అందుబాటులోకి వస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -