Wednesday, July 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇసుక టిప్పర్లు పట్టివేత

ఇసుక టిప్పర్లు పట్టివేత

- Advertisement -

నవతెలంగాణ-మిడ్జిల్ 
ప్రభుత్వం నుండి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులోని దుందిబి వాగు నుండి సోమవారం తెల్లవారుజామున రెండు టిప్పర్లు ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో టిప్పర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -