Tuesday, September 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి ఇంటి వివరాలు సమగ్రంగా నమోదు చేయాలి

ప్రతి ఇంటి వివరాలు సమగ్రంగా నమోదు చేయాలి

- Advertisement -

 జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు
నవతెలంగాణ-ఆలేరు టౌను

ప్రతి ఇంటి వివరాలను సమగ్రంగా నమోదు చేసి, ఎటువంటి పొరపాట్లు లేకుండా ఎన్యూమరేటర్లు విధులు నిర్వహించాలని, యాదాద్రి భువనగిరి జిల్లా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. మంగళవారం ఆలేరు మున్సిపాలిటీలో పరిధిలో ఇండ్ల గణనను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సూపర్వైజర్లు నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తూ గృహ గణన పురోగతిని రోజువారీగా సమీక్షించాలని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువు ప్రకారం జూన్ 9లోపు జనగణన కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో పూర్తి చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని  సూచించారు. కార్యక్రమంలో  మున్సిపల్ మేనేజర్ కే శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారి దూడల వెంకటేష్, మున్సిపల్ బిల్ కలెక్టర్ నాగేందర్,  ఎన్యూమారేటర్లు, పురపాలక సిబ్బంది,  సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -