- Advertisement -
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్‌పూర్ గ్రామంలో సర్పంచ్ ర్యాకల సంతోష్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థులను కలిసి ప్రభుత్వ పాఠశాలలలో ఉన్న సౌకర్యాలు, అర్హత కలిగిన ఉపాధ్యాయుల గురించి వివరించి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వరిగంటి కృష్ణ, వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, ఎస్కే గాలిబ్ యాకుబ్, బొమ్మరపు రామకృష్ణ, బొమ్మరపు లక్ష్మీ బాలరాజు, బిట్కూరు మహేష్, వరిగంటి మానస నాగరాజు, ఎస్కే హైమద్, హెచ్ఎం వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
- Advertisement -



