- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఆన్‌లైన్‌లో ఈ-ఫార్మసీలు, పెద్ద కార్పొరేట్ కంపెనీలు భారీ డిస్కౌంట్లతో మందులను విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు(బుధవారం) దేశవ్యాప్తంగా రిటైల్ మెడికల్ షాపులు మూతపడనున్నాయి. అయితే అపోలో, మెడ్‌ప్లస్ వంటి మెయిన్ చైన్ షాప్స్, దవాఖానలకు అనుబంధంగా ఉండే మందుల షాపులు, ప్రభుత్వ దవాఖానల ఔషధ కేంద్రాలు, 24 గంటల పాటు పని చేసే ఫార్మసీలు, జన్ ఔషధి కేంద్రాలు తెరిచే ఉందానున్నాయియి. అవసరమైన మెడిసిన్స్ కోసం వాటిని సంప్రదించండి.
- Advertisement -



