తొలిరౌండ్ లోనే ఓడిన లక్ష్యసేన్, ప్రణయ్
మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ
కౌలాలంపూర్: మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ లో భార త యువ షట్లర్ అస్మిత్ చాలీహా, మాల్విక బన్సోద్ మినహా.. మిగిలిన షట్లర్లంతా తొలిరౌండ్ లోనే ఇంటిదారి పట్టారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్ పోటీలో మాల్విక బన్సోద్ 21-17, 16-21, 21-9తో జర్మనీకి చెందిన ప్రపంచ 52వ ర్యాంకర్ యోనే లీను చిత్తుచేయగా.. అస్మిత్ చాలీహా 21-16 21-13తో వియర్వాన్ (మలేషియా)ను ఓడించి రెండోరౌండ్ కు చేరారు. ఇక అన్మోల్ ఖర్బ్ 21-13తో తొలి సెట్ గెలిచినా.. ఆ తర్వాత రెండు సెట్లను 16-21, 19-21తో 6వ సీడ్ డెన్మార్క్ కు చెందిన ఖజెర్ఫోర్ట్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. ఇక హేమంత్ 19-21, 7-21తో చైనీస్ తైపీకి చెందిన హువాంగ్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక పురుషుల సింగిల్స్ లో 8వ సీడ్ లక్ష్యసేన్ 17-21, 11-21తో ఉబేదుల్లా(మలేషియా) చేతిలో వరుససెట్లలో ఓడాడు. ఇక హెచ్ ఎస్ ప్రణయ్ 17-21, 22-20, 22-24తో 6వ సీడ్ నరోకా(జపాన్) చేతిలో ఓడాడు.
మాల్విక, అస్మిత్ ముందుకు
- Advertisement -
- Advertisement -



