Thursday, May 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమొక్కజొన్న సంచులను తరలించాలి

మొక్కజొన్న సంచులను తరలించాలి

- Advertisement -

జొన్న పంట ఎకరాకు 
20 క్వింటాళ్లు కొనుగోలు చేయాలి
తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా
నవతెలంగాణ-బజార్‌హత్నూర్‌

వర్షాలకు మొక్కజొన్న, జొన్న సంచులు తడుస్తున్నాయని, వెంటనే తరలించాలని డిమాండ్‌ చేస్తూ ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండల కేంద్రంలో బుధవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మొక్కజొన్న కాంటాలు వేసి వారం రోజులు గడిచినా సుమారు 7 వేల సంచులు ఇప్పటికీ కేంద్రాల్లోనే ఉండటంతో అకాల వర్షానికి తడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే లారీలు పంపించి లోడింగ్‌ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అలాగే జొన్న పంటను ఎకరానికి 20 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని కోరారు. ఇప్పటికే కొనుగోలు చేసిన సుమారు 15 వేల జొన్న సంచులను వెంటనే లారీల్లో లోడ్‌ చేసి తరలించాలన్నారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా ఎలాంటి షరతులూ లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు డుబ్బుల చంద్రశేఖర్‌, దనగరి రాములు, ప్రభాకర్‌, తోకల రాజన్న, అనుము సాయన్న, అగ్గు నందు, ధనుంజరు, ఫరీద్‌ ఖాన్‌, లక్కం శంకర్‌, సోమ రామ్‌రెడ్డి, లక్కం శ్రీనివాస్‌, గంట చిన్నయ్య, మారుతి, తడక శ్రీనివాస్‌, దనగరి పండరి, సూది వినాయక్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -