స్కూల్ బస్సుల తనిఖీలకు
రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్
ఫిట్‌నెస్ లేకపోతే వాహనాల సీజ్
చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలో పాఠశాలలు , విద్యాసంస్థలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో రవాణా శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం విద్యార్థులు ప్రయాణించే అన్నీ విద్యాసంస్థల బస్సులు , ఇతర వాహనాలను తప్పనిసరిగా తనిఖీలు చేయాలని నిర్ణయించింది. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండే వాహనాలను మాత్రమే రవాణా శాఖ రోడ్లమీదకు అనుమతించనుంది.ఏవైనా విద్యాసంస్థలు మార్గదర్శ కాలకు వ్యతిరేకంగా వ్యవహరించినా, ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీచేసింది. ఫిట్‌నెస్ లేని వాహనాలు భారీ సంఖ్యలో విద్యార్థులను ఎక్కించుకొని నడుపుతున్నా, భద్రతా ప్రమాణాలు పాటించని వాహనాలపై ప్రత్యేక దృష్టిసారించాలని నిర్ణయించింది. ఉల్లంఘనలకు పాల్పడే విద్యా సంస్థలు, ఇతర సంస్థలపై కఠిన చర్యలు తీసుకునేందుకు రవాణా శాఖ సమాయత్తమవుతున్నది. ఇందుకు ప్రత్యేక తనిఖీలు చేసేందుకు తన యంత్రాంగాన్ని సంసిద్ధిం చేస్తున్నది.
వేల బస్సులు..లక్షల్లో విద్యార్థులు
రాష్ర్టవ్యాప్తంగా దాదాపు 41 వేల ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 61 లక్షల మంది విద్యనభ్య సిస్తున్నారు. ఇందులో 11 వేల ప్రయివేటు పాఠశాలలు. వీటిలో దాదాపు 38 లక్షల మంది విద్యార్థులు చదువు కుంటున్నారు. ఇకపోతే ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజినీ రింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు లక్షల్లో ఉన్నారు. భద్రతలేని బస్సులు, వ్యాన్లు, ఆటో రిక్షా ల్లో ప్రయాణిస్తూ ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ తరహా ప్రయాణాలు చేసి 2023లో 10 వేల రోడ్డు ప్రమాణాలు చోటుచేసుకున్నాయి. అలాగే 2024లో 7281 రోడ్డు యాక్సి డెంట్లల్లో వందలాది మంది గాల్లో దీపాల వుతున్నాయి.
వీటిని పాటించకపోతే..
వాహనాలకు చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికేట్, పర్మిట్, ఇన్సూరెన్స్, కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ ఉన్నాయా ? లేదా ? అనే అంశాలను రవాణా శాఖ తన తనిఖీల్లో పరిశీలించనుంది. అనుమతించిన సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కిస్తున్నారా లేదా తదితన విషయాలనూ తనిఖీల్లో చూస్తారు. డ్రైవర్ల లైసెన్స్ , లేదా అనుభవం ఉన్నదా సంగతిని కూడా తనిఖీ చేస్తారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ వంటి భద్రతా ప్రమాణాలను పరిశీలించనున్నారు. వాహనాలకు బ్రేకులు, టైర్లు, లైట్లు, ఇతర యాంత్రిక భాగాలు సక్రమంగా ఉన్నాయా లేదా కూడా చూస్తారు. విద్యార్థుల భద్రత కోసం వాహనంలో అటెండర్‌ను అందుబాటులో ఉంచారా ? లేదా ? అనే విషమాలను తనిఖీ చేస్తారు.
ఓవర్‌లోడ్
ఫిట్‌నెస్ లేకుండా నడుస్తున్న వాహనాలు లేదా ఓవర్‌లోడ్ చేస్తున్న వాహనాలను వెంటనే సీజ్ చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం వాహన యజమానులు, డ్రైవర్లు,సంబంధిత విద్యాసంస్థల యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోనున్నారు. విద్యార్థులను రవాణా చేసే విద్యాసంస్థల వాహనాల నిర్వహణ, భద్రతా ప్రమాణాల అమలు నిబంధనల పాటింపు పూర్తి బాధ్యత సంబంధిత పాఠశాల, కళాశాల యాజమాన్యాలదేనని రవాణా శాఖ స్పష్టం చేసింది.
తల్లిదండ్రులూ జాగ్రత్త
తల్లిదండ్రులకు కూడా అవగాహన క ల్పించాలని భావిస్తున్నది. అధిక సంఖ్యలో విద్యార్థులను ఎక్కించుకునే వాహనాలలో తమ పిల్లలను పంపవద్దని రవాణా శాఖ సూచిస్తున్నది. ఫిట్‌నెస్ లేని లేదా ఓవర్‌లోడ్ వాహనాలను తనిఖీల్లో భాగంగా సీజ్ అయితే విద్యార్థులు మధ్యలో ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రయాణించే వాహనాల ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాలు, అనుమతులపై ముందుగానే నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు.
ఫిట్‌నెస్ తప్పదు
అన్నీ విద్యాసంస్థల యాజమాన్యాలు తమ వాహనాలను క్రమం తప్పకుండా ఫిట్‌నెస్ పరీక్షలకు చేయించుకోవాలనే మార్గదర్శకాలను రవాణా శాఖ ఇప్పటికే విడుదల చేసింది. చదువుకునే పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని రవాణా శాఖ స్పష్టం చేస్తున్నది. పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి విద్యార్థులను పాఠశాలలకు చేరవేసే ప్రతి వాహనం ఫిట్ నెస్ కలిగి ఉండాలని స్పష్టం చేస్తున్నది. పరిమితికి మించి వాహనాలను రోడ్లపైకి తేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
విద్యార్థుల భద్రతే లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



