నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో.. గెజిట్ పత్రాలు దహనం చేసిన మెడికల్ రిప్‌లు
నవతెలంగాణ-కంఠేశ్వర్
నాలుగు లేబర్ కోడ్‌ల అమలుకు గెజిట్‌ను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాటిని రద్దు చేయాలని మెడికల్ రీప్రజెంటేటివ్స్ యూనియన్ (టీఎంఎస్‌ఆర్‌యూ – సీఐటీయూ) ఆధ్వర్యంలో నిజామా బాద్‌లోని లేబర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి లేబర్ కోడ్ గెజిట్ పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా కార్మికులు లేబర్ కోడ్‌ల ను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ.రమేష్‌బాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలు, యజమాను లకు మరింత లాభాలను పెంచడానికి కార్మిక హక్కులను పణం గా పెట్టి కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్‌లను తీసు కొచ్చిందని అన్నారు. వీటికి వ్యతి రేకంగా దేశ వ్యాప్తంగా కార్మికవర్గం పోరాటాలు నిర్వహించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాటిని లెక్కచేయ కుండా గెజిట్‌ను విడుదల చేసిందని విమర్శించారు. ఫలితంగా యాజమా న్యాలు లేబర్ కోడ్‌లను అమలు జరపటానికి, పని గంటలు పెంచ టానికి, వేతనాల్లో కోతలు విధించ డానికి సిద్ధపడు తున్నాన్నారు. వీటి మూలంగా కార్మికులకు భద్రత లేకుండా పోయిందని, ఇది పూర్తిగా కార్మిక వ్యతిరేక చర్య అని, వెంటనే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయా లని, గెజిట్‌ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే కాలంలో అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు ఐక్య పోరాటాలకు సిద్దపడాల్సి వస్తుందని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ రీప్రంజెంటేటివ్స్ యూని యన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి గంగామోహన్, నాయకు లు సంపత్, శేషు, లక్ష్మీకాంత్, కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.
నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



