Thursday, May 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కరెంట్ షాక్ కు గురై తడి హిప్పర్గాలో వ్యక్తి మృతి

కరెంట్ షాక్ కు గురై తడి హిప్పర్గాలో వ్యక్తి మృతి

- Advertisement -

వతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ మండలంలోని తడి హిప్పర్గా లో కరెంట్ షాక్ గురై వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై మోహన్ రెడ్డి తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తడిహీపర్గా గ్రామంలోని నాగురావ్ తండ్రి లక్ష్మణ్ వయస్సు 50 సంవత్సరాలు కులం కురుమ గల మృతుడికి కరెంటు పని రావడం వలన గ్రామంలో ఉన్న లైన్మెన్ మహేష్ కి సహాయంగా ఉంటూ గ్రామంలోని కరెంటు స్తంభాలు ఎక్కడం దిగడం చిన్న చిన్న కరెంటు సమస్యలు ఉంటే వెళ్లి చూస్తూ బాగు చేయడం లాంటివి చేస్తూ ఉండేవాడు. గురువారం ఉదయం  8: 30 గంటలకు ఆ గ్రామంలోని గ్రామపంచాయతీ దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉదయం నుండి కరెంట్ లేకపోవడం వల్ల ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్న కరెంటు స్తంభం పైకి ఎక్కి పనిచేస్తుండగా దాని పైననే ఉన్న 11 కెవి కరెంట్ లైన్కి తన కుడి చేతి తాకడం వల్ల కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించినట్లు మృతుని కొడుకు బూరె దత్తు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మోహన్ రెడ్డి విలేకరులకు వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -