నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఇటీవల నూతనంగా ఎన్నికైన గంధమల్ల అశోక్‌ను శర్బణాపురం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సైదాపురం సురేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు అశోక్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి ఆయన సమర్థవంతంగా కృషి చేసి ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండాలని ఆకాంక్షించారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బుగ్గ నవీన్, సీత శ్రీహరి,కారే రమేష్,గడ్డమీద నరేష్, నరేష్ తదితరులు పాల్గొని అశోక్‌కు అభినందనలు తెలిపారు. అనంతరం మాజీ మండల పార్టీ అధ్యక్షుడు వేంకటేశ్వర రాజు కు నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించి, పార్టీ అభివృద్ధికి ఆయన అందించిన సేవలను కొనియాడరు.
కాంగ్రెస్ మండలాధ్యక్షునికి ఘన సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



