– గజ్వేల్ ఏడిఏ బాబు నాయక్.
నవతెలంగాణ – రాయపోల్ : ఎల్ నినో ప్రభావం వలన తీవ్ర కరువు ఏర్పడి వానాకాలంలో వర్షాలు పడే పరిస్థితులు లేవని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి సంరక్షణ పై రైతులు అవగాహనతో దృష్టి సారించాలని గజ్వేల్ ఏడిఏ బాబు నాయక్, ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. బుధవారం రాయపోల్ మండలం రాంసాగర్,ముంగిస్ పల్లి, ఎల్కల్, వడ్డేపల్లి, గ్రామాలలో ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులకు అవగాహన కల్పించేందుకు గ్రామసభలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీటి సంరక్షణ, తేమ నిర్వహణ, పంటల రక్షణ చర్యలను పాటించాలని కోరారు. వరికి ప్రత్యామ్నాయంగా జొన్న, సజ్జ, రాగులు, పచ్చకంకి మొక్కజొన్న, కంది, పెసర, మినుము, నువ్వులు, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, ఆముదం వంటి తక్కువ నీటితో సాగు చేసే పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.ఉపాధి హామీ పథకం కింద ఫామ్‌పాండ్లు 100 శాతం సబ్సిడీతో అందుబాటులో ఉన్నాయని, వాటి ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకుని బెట్ట పరిస్థితుల్లో పంటలకు అవసరమైన నీటిని అందించి నష్టాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు.అలాగే బెట్ట పరిస్థితుల్లో పంటలను రక్షించేందుకు లీటర్ నీటికి 2.5 గ్రాముల చొప్పున 13:0:45 పొటాషియం నైట్రేట్ లేదా లీటర్ నీటికి 2 మి.లీ నానో యూరియా కలిపి ఆకులపై పిచికారీ చేయాలని సూచించారు. దీంతో పంటలు కొంతకాలం వరకు బెట్ట పరిస్థితులను తట్టుకునే అవకాశముంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్. నరేష్, ఏపీఎం యాదగిరి, సర్పంచులు నరేష్ గౌడ్, రేణుక రాజా గౌడ్, వెంకటయ్య, ఆసియా ఇక్బాల్, ఏఈఓలు శిరీష, స్వర్ణలత, టిఏలు అనిల్, వెంకటేష్, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడి టీచర్లు, ఆశ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి సంరక్షణ పై రైతులకు దృష్టి సారించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



