శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మమ్మ
నవతెలంగాణ-చిన్నకోడూరు
సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడి సాధించవచ్చని భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డా. లక్ష్మమ్మ, డా. ప్రధుమన్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చర్ల అఃకిరెడ్డి పల్లి గ్రామంలో చిన్నకోడూరు మండల రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సమతుల్య ఎరువుల వినియోగం’పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులందరూ తప్పనిసరిగా మట్టి పరీక్షల ఆధారంగానే ఎరువులను వాడాలని, నేల సారం పెరగడంతో పాటు పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గుతాయని వారు సూచించారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి జీవన ఎరువులను (బయో ఫెర్టిలైజర్స్) ఎక్కువగా ఉపయోగించాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోవై.పి. నిహారిక,ఉప సర్పంచ్ నాగరాజు, రైతులు పాల్గొన్నారు.
సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



