- Advertisement -
నవతెలంగాణ – తిమ్మాజీపేట
ఆర్యవైశ్య సంఘం తిమ్మాజిపేట మండల అధ్యక్షుడుగా మనసాని సాయి శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కమిటీని తిమ్మాజిపేట మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి జిల్లా ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ శివకుమార్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా దాచేపల్లి నిశ్వంత్ కుమార్ ఉపాధ్యక్షులుగా దాచేపల్లి రామ్మోహన్, కొండూరు పాండు రంగయ్య, కోశాధికారిగా పాపిశెట్టి చంద్రమౌళి ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు మనసాని సాయి శంకర్ ను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు దాచేపల్లి వేణు వున్నారు.
- Advertisement -



