Saturday, May 23, 2026
E-PAPER
Homeకరీంనగర్22 సార్లు జైలుకు.. అయినా మారని తంతూ

22 సార్లు జైలుకు.. అయినా మారని తంతూ

- Advertisement -

30 కేసులు… 25 ఏళ్లు… 22 సార్లు జైలుకు…
దొంగతనాల్లో ఆరితేరిన యువకుడిపై రౌడీషీట్..
పొద్దంతా జల్సాలు..
రాత్రి దొంగతనాలు..
సెల్ఫోన్ వాడకుండా దొంగతనాలు..
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

అతను బక్క పల్చని యువకుడు… చూస్తే అయ్యో పాపం అంటారు..కానీ అతను చేసేవి మాత్రం ప్రతి ఒక్కరిని అబ్బురపరుస్తుంది. 25 ఏళ్ల యువకుడు ఇప్పటికి 22 సార్లు జైలుకు వెళ్లాడు. అతనిపై 30 కేసులు నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ఆడెపు రవి (25) అనే వ్యక్తి తాలం వేసినా ఇండ్లు దొంగతనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆడపు రవి పై రౌడీ షీట్ ఉంది. ఆడెపు రవి అసలు సెల్ ఫోన్ వాడడు. అంతేకాకుండా తన స్నేహితులతో  పాటు ద్విచక్ర వాహనాలను వాడుకుంటూ దొంగతనాలు చేస్తూ వచ్చిన బంగారం ఇతర సామాగ్రి ని అమ్ముకుంటూ జల్సాలకు అలవాటు పడ్డాడు.

తన స్నేహితులతో జల్సాలు చేయిస్తాడు దీంతో స్నేహితులు అతను చెప్పింది వింటూ ఉండేవారు. స్నేహితులు చెప్పినది వినకపోతే దొంగతనాలకు పాల్పడ్డావని పోలీసులకు పట్టిస్తానని వారిని బెదిరించి తనకు కావలసిన పనులను వారితో చేయించుకుంటుండేవాడు. పొద్దంతా జల్సాలు చేస్తూ రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతూ అనేకసార్లు జైలుకు వెళ్లిన రవి యువతను పక్కదారి పట్టించడంలో దిట్టగా మారాడు. ఆయనతో కలిసి మరో ఏడు మంది దొంగతనాలకు పాల్పడడంతో శనివారం సిరిసిల్ల డి.ఎస్.పి కత్రోజు నాగేంద్ర చారి వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వారి నుంచి17.5 గ్రాముల బంగారు ఆభరణాలు,14.5 తులాల వెండి ఆభరణాలు,మూడు ద్విచక్ర వాహనాలు,ఒక ఆటో,రెండు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.

సిరిసిల్లలో ఎనిమిది మంది దొంగల ముఠా అరెస్ట్..
సిరిసిల్లలోని బి వై నగర్ కు చెందిన ఆడెపు రవి తో కలిసి కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన సామల బాలకిషన్ ప్రస్తుతం వేములవాడలోని సుభాష్ నగర్ లో ఉంటున్నాడు. వేములవాడ అర్బన్ మండలం చింతల్ టానాకు చెందిన బోదాసు గోపి, సిరిసిల్లలోని విద్యానగర్ కు చెందిన వేముల సాయి చరణ్ రెడ్డి, కోనరావుపేట మండలం కొలనూరు కు చెందిన గాజులవేణి అరుణ్ కుమార్, ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ కు చెందిన మూల అభిలాష్ ప్రస్తుతం సిరిసిల్లలోని విద్యానగర్ లో ఉంటున్నాడు. వేములవాడ మండలం అనుపురం కు చెందిన శీలం సంతోష్ రెడ్డి, గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన కస్తూరి సాయి తేజ ప్రస్తుతం ముస్తాబాద్ మండలం మురాయిపల్లిలో ఉంటున్నాడు. వీరంతా దొంగతనాలకు పాల్పడ్డారు.

ఒక్కొక్కరిపై అనేక కేసులు..
సిరిసిల్ల బి. వై నగర్ కి చెందిన అడెపు రవి అనే వ్యక్తి జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుని పగలు సమయాల్లో పట్టణంలో రెక్కీ చేసి తన స్నేహితులు సామల్ల బాలకిషన్, బోదాసు గోపి, వేముల సాయి చరణ్ రెడ్డి, గాజులవేణి అరుణ్ కుమార్, మూల అభిలాష్ లతో ఒక ముఠాగా ఏర్పడి రాత్రి సమయాల్లో దొంగతనాలకు పాల్పడుతుండేవాడు. అడెపు రవి గతంలో అనేకసార్లు జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాక మళ్లీ నేరాలకు పాల్పడలని నిర్ణయించుకుని,దొంగతనాలు చేస్తు బంగారు,వెండి ఆభరణాలను అమ్మితే వచ్చిన డబ్బులతో జల్సాలు చేయాలని నిర్ణయించుకున్నారు. దొంగతనాలకు పాల్పడిన వారిలో సామల బాలకిషన్ పై ఆరు  కేసులు, మూల అభిలాష్ పై ఆరు కేసులు, వేముల సాయి చరణ్ రెడ్డి పై మూడు కేసులు, గాజుల వేణి అరుణ్  బోధసు గోపి ల పై ఒక్కొక్క కేసు గతంలోనే నమోదయింది. వీరిపై గతంలోనే నేర చరిత్ర ఉంది.

పోలీసులు ఎలా పట్టుకున్నారంటే..
ఈ ఎనిమిది మంది దొంగలు 26 ఏప్రిల్ 2026 నుండి 21 మే 2026 వరకు సిరిసిల్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐదు ఇండ్లలో రాత్రి సమయంలో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డారని,ఇంటి యజమానుల ఫిర్యాదు మేరకు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా,తేది 23 మే2026 న ఉదయం నిందుతులు ఏదైనా పెద్ద దొంగతనం చేద్దామని అనుకోని ఆటోలో సిరిసిల్ల కు వస్తుండగా నమ్మదగిన సమాచారంతో సిరిసిల్లలోని ఎల్లమ్మ సర్కిల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.

అదుపులోకి తీసుకున్న నిందుతులను విచారించగా దొంగతనం చేసిన బంగారు ఆభరణాలు ముస్తాబాద్ లోని కస్తూరి సాయితేజ కి, కొన్ని బంగారు మరియు వెండి ఆభరణాలు వేములవాడలోని శీలం సంతోష్ రెడ్డి కి అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసినామని చెప్పగా వారి వద్ద నుండి బంగారు వెండి ఆభరణాలు,నగదు 1500/- ,మోటార్ సైకిళ్ళు,ఆటో స్వాదిన పరుచుకున్నారు. నిందుతులను పట్టుకోవడంలో కృషి చేసిన పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్.ఐ శ్రీకాంత్, సిబ్బంది పుల్కమ్ శ్రీనివాస్, శ్రీకాంత్ , మారుతి, రవి , నాంపెళ్లి శ్రీనివాస్, నాగరాజు లను డిఎస్పీ నాగేంద్ర చారి ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -