- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
తొలి ఏకాదశి సందర్భంగా శనివారం మద్నూర్ మండలంలోని తడి హిప్పర్గా గ్రామ సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్న కుటుంబ సమేతంగా బీర్కూరు మండలంలోని బహిరంగపూర్ గ్రామంలో గల విట్టల రుక్కుమ్మాయి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశ్విని మాట్లాడుతూ.. తోలి ఏకాదశి శనివారం రావడం ప్రత్యేకమని పేర్కొన్నారు. ఈ ఏడాది పాడి పంటలు బాగా పండాలని ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, ఆ భగవంతున్ని కోరుకున్నట్టు తెలిపారు. సర్పంచ్ కుటుంబ సభ్యులతోపాటు బంధుమిత్రులు పాల్గొన్నారు.
- Advertisement -



