Saturday, May 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చదువుతోనే సమాజంలో మార్పు 

చదువుతోనే సమాజంలో మార్పు 

- Advertisement -

మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోత
నవతెలంగాణ-మిడ్జిల్ 

చదువు ద్వారానే  సమాజంలో మార్పు వస్తుందని, కష్టంతో అనుకోకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవడం చాలా సంతోషంగా ఉందని జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, రంగారెడ్డి గూడా మాజీ సర్పంచ్ శశికళ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని షారోను మెమోరియల్ చర్చి ఆధ్వర్యంలో మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాలకు చెందిన డాక్టర్  చదువు పూర్తి అయిన  16 మంది విద్యార్థులకు ఘనంగా శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డాక్టర్ చదువు ఎంతో కష్టంతో కూడుకున్నదని కష్టపడి చదువుకొని డాక్టర్ అయినందుకు విద్యార్థులను అభినందించారు. పేద ప్రజలకు  ఉచితంగా మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని, గ్రామీణ ప్రాంతాలలో ఎంతో  మంది పేద ప్రజలు ఉన్నారని వారికి నాణ్యమైన వైద్యాన్ని అందిస్తే ప్రజలు మంచి గుర్తింపు ఇస్తారని చెప్పారు. మండలంలో 16 మంది విద్యార్థులు డాక్టర్లు కావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. వైద్య విద్య  చదువుకున్నందుకు  మండలానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులు ఎడ్ల శంకర్ ముదిరాజ్, పాస్టర్ రాజారత్నం, సంఘ పెద్ద రత్తమ్మ, అడ్వకేట్ నోవా   బిల్ గేట్స్ రెడ్డి, డాక్టర్లు రిషిక, సుప్రజ చంద్ర , రోహిత్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -