మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న చిత్రం ‘లెనిన్’. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 26న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, పాటలు, గ్లింప్స్ అన్నీ కూడా ప్రేక్షకులలో ఆసక్తిని పెంచేశాయి. నాగార్జున సినీ జర్నీ ప్రారంభించి నలభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘లెనిన్’ నుంచి టీజర్‌ను విడుదల చేశారు. ‘మనోడు వస్తున్నాడు’ అనే డైలాగ్‌తో ‘లెనిన్’ టీజర్ మీద హైప్ పెరిగింది. ‘నేను తప్పిపోయి రాలేదు మచ్చా.. మీ అందరినీ వెతుక్కుంటూ వచ్చిన’ అని చెప్పిన డైలాగ్‌తో హీరో పాత్రలోని ఇంటెన్సిటీని చూపించారు. స్టేజ్ మీద నాటకాల్లో భాగంగా సీనియర్ ఎన్టీఆర్ శక్తివంతమైన డైలాగ్‌లను భాగ్యశ్రీ బోర్సే చెప్పిన తీరు బాగుంది. అఖిల్, భాగ్యశ్రీల మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. చిత్తూరు యాసలో అఖిల్ చెప్పిన డైలాగ్స్, ఆయన బాడీ లాంగ్వేజ్, రగ్డ్ లుక్ అన్నీ కూడా హైలెట్‌గా నిలిచాయి. అఖిల్ గత చిత్రాలతో పోలిస్తే ఈ ‘లెనిన్’లో పూర్తి డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు. అఖిల్ డైలాగ్ డెలీవరి, చిత్తూరు యాసను పలికించిన తీరు, మాస్ రగ్డ్ లుక్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌ని కట్టి పడేసేలా ఉన్నాయి. అద్భుతమైన విజువల్స్, తమన్ అందించిన ఆర్ఆర్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘లెనిన్’ ఇంటెన్స్ ఎమోషన్స్‌తో పీరియాడిక్ విలేజ్ డ్రామాగా రాబోతోందని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ టీజర్‌లో శివాజీ, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి నిర్మాతలు: అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ, సమర్పణ: అన్నపూర్ణ స్టూడియోస్, రచయిత -దర్శకుడు: మురళి కిషోర్ అబ్బూరు, సంగీతం: థమన్ ఎస్, ఎడిటర్: నవీన్ నూలి, సినిమాటోగ్రఫీ: లియోన్ బ్రిట్టో, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా.



