Monday, May 25, 2026
E-PAPER
Homeఆటలుక్రీడా వారోత్సవాలు విజయవంతం

క్రీడా వారోత్సవాలు విజయవంతం

- Advertisement -

వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహణ
హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన యువజన క్రీడా వారోత్సవాలు విజయవంతం అయ్యాయి. హైదరాబాద్‌‌లోని స్టేడియాలు సహా జిల్లా, మండల కేంద్రాల్లో వారం రోజుల పాటు క్రీడా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. క్రీడా వారోత్సవాలు యువతలో క్రీడా స్ఫూర్తి, నాయకత్వ లక్ష‍ణాలు, నైపుణాభివృద్ది, సామాజిక బాధ్యత సహా ఉపాది అవకాశాలపై అవగాహన పెంచాయి. ఈ సందర్భంగా నిర్వహించిన జాబ్‌ ‌మేళాలకు 40 వేల మంది పేర్లు నమోదు చేసుకోగా, 22 వేల మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. 11200 మంది షార్ట్‌‌లిస్ట్‌ ‌కాగా.. 5700 మంది యువతకు ఉద్యోగాలు లభించాయి. క్రీడా వారోత్సవాల ముగింపు వేడుకలలో శాట్జ్‌ చైర్మెన్‌ ‌శివసేనారెడ్డి యువతకు నియామక పత్రాలు, ఆటల పోటీల విజతేలకు బహుమతులు ప్రదానం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -