Tuesday, May 26, 2026
E-PAPER
Homeసినిమాత్వరలోనే అందరికీ ఆమోద యోగ్యమైన పరిష్కారం

త్వరలోనే అందరికీ ఆమోద యోగ్యమైన పరిష్కారం

- Advertisement -


ఇది ‘పెద్దిసమస్య మాత్రమే కాదు.. పరిశ్రమది : టి.ఎఫ్.డి.సి.ఛైర్మన్ దిల్ రాజు సింగిల్ స్క్రీన్స్ కి పర్సెంటేజ్ విషయంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యని తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు సోమవారం చిరంజీవి దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు, టీఎఫ్సీసీ ప్రెసిడెంట్ సురేశ్‌బాబు, నిర్మాతలు కేఎల్‌ నారాయణ, అల్లు అరవింద్‌, తెలంగాణ ఛాంబర్‌ ఎగ్జిబిటర్లు తదితరులు చిరంజీవితో సమావేశమయ్యారు. విషయాలన్నీ పూర్తిగా విన్న చిరంజీవి పరిశ్రమలో భాగస్వాములైన అందరికీ పూర్తి న్యాయం జరిగేలా ఉండాలని, ఒక్క సినిమా గురించో, ఒక్క సెక్టార్ గురించో ఈ చర్చ కాదని, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలనే పరిశ్రమ కొన్ని పద్దతులను ఏర్పరుచుకుంది అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకి హైయెస్ట్ బాడీ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనే విషయాన్ని గుర్తు చేసి, ఆ ఛాంబర్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వుండటం అందరికీ సముచితం తెలిపారు. ఇంతకు ముందు వేసిన వేరే కమిటీల పని తీరు, ఫలితాల పట్ల సింగిల్ స్క్రీన్స్ సభ్యులలో కొంత అసంతృప్తి, అపనమ్మకం ఉందన్న విషయం తనకి అర్ధం అయ్యిందని చిరంజీవి అన్నారు. ఈ సారి ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీ అనుకున్న గడువులో అంటే జూన్ 30 వ తేదీ వరకూ అన్ని విషయాలని పూర్తిగా పరిశీలించి ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్ర్స్, ఎగ్జిబిటర్లు అందరికీ న్యాయం జరిగేలా పర్సెంటేజ్ మోడల్ మీద ప్రతిపాదనని చేస్తుందనే తనకు నమ్మకం ఉందన్నారు. ఆ కమిటీ సకాలంలో బాధ్యతలు పూర్తిచేసి నివేదిక ఇవ్వటానికి తనవంతు కూడా పూర్తి ప్రయత్నం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. చిరంజీవి సమయం వెచ్చించి తమకున్న సమస్యలని, భయాలని, ప్రస్తుతం సింగిల్ స్క్రీన్స్ కి వున్న పరిస్థితులని అవగాహన చేసుకుని అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇవ్వటం పట్ల సభ్యులం దరూ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. వారి అసోసియేషన్స్ లో వున్న మిగతా సభ్యులందరికి ఈ సమావేశం గురించి తెలియచేసి 24 గంటలలో తమ ఆమోదాన్ని తెలియచేస్తామని తెలిపారు. సమావేశం అనంతరం మీడియాతో తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు మాట్లాడుతూ,'పర్సెంటేజ్ విధానం అనేది కేవలం 'పెద్దిది మాత్రమే కాదు. మొత్తంగా పరిశ్రమది. ఈ విధానానికి సంబంధించి ఎగ్జిబిటర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను విని, వారికి చిరంజీవి మాటిచ్చారు. సమస్యని కమిటీకి అప్పగించి, ఆ కమిటీ ద్వారా రెండు రోజుల్లో పరిష్కారిస్తామని చెప్పారుఅని తెలిపారు. శ్రీధర్ మాట్లాడుతూ, 'చిరంజీవి మా సమస్యలను పూర్తిగా విన్నారు. ఇప్పటికే ఏర్పాటైన కమిటీతో కూడా మాట్లాడతానని హామీ ఇచ్చారు. మేము కూడా ఎగ్జిబిటర్స్‌తో మరోసారి సమావేశమై, చర్చించి తుది నిర్ణయాన్ని చెప్తాం అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -