అబ్రహం ఒప్పందాలలో చేరండి అరబ్, ముస్లిం దేశాలను కోరిన ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియాలో ఓ కొత్త రాజకీయ క్రమాన్ని ముందుకు తెస్తున్నారు. ఇరాన్ యుద్ధం ముగిసిన తర్వాత అరబ్ దేశాలు అబ్రహం ఒప్పందాలలో చేరాలని ఆయన కోరుతున్నారు. మధ్యప్రాచ్యంలో యుద్ధానికి ముగింపు పలి కేందుకు ఇరాన్, అమెరికా మధ్య చర్చలు ఊపం దుకుంటున్న తరుణంలో ట్రంప్ దృష్టి శాంతి స్థాపనపై కంటే చాలా పెద్ద విషయం పైనే పడినట్లు కన్పిస్తోంది. పశ్చిమాసియా స్వరూపాన్నే మార్చేయాలని ఆయన భావిస్తున్నారు. యాక్సియోస్ వార్తా సంస్థ కథనం ప్రకారం…ట్రంప్ శనివారం ఓ ఉన్నత స్థాయి కాన్ఫరెన్స్ కాల్‌లో పలు అరబ్, ముస్లిం దేశాల నేతలతో మాట్లాడారు. ఇరాన్‌తో యుద్ధం ముగిసిన తర్వాత మరిన్ని దేశాలు ఇజ్రాయిల్‌ను గుర్తించి అబ్రహం ఒప్పందాలలో చేరాలని తాను కోరుకుంటున్నానని వారికి చెప్పారు. అనూహ్యంగా వచ్చిన ఈ ప్రతిపాదనపై వారంతా ఆశ్చర్యానికి గుర య్యారు. ఈ సమావేశంలో సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్, బV్‌ారైన్ దేశాల నేతలు పాల్గన్నారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న అస్థిర పరిస్థితులను తొలగించి ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నాలు కొన గుతున్న సమయంలో ఈ భేటీ జరగడం గమనార్హం.
సౌదీ, ఖతార్, పాక్ మౌనం
ఇప్పటికీ ఇజ్రాయిల్‌ను గుర్తించని దేశాలు ఇరాన్ యుద్ధం ముగిసిన తర్వాత దానితో సంబంధాలను నెలకొల్పుకునేందుకు ముందుకు వస్తాయని అనుకుంటున్నానని ఆయా దేశాల నేతలకు ట్రంప్ చెప్పారు. ఆయన ఈ మాట అన్న తర్వాత కొద్దిసేపు నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఇజ్రాయిల్‌తో ఎలాంటి దౌత్య సంబంధాలు లేని సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్ నేతలు మౌనం వహించారు. ట్రంప్ ప్రతిపాదనకు సౌదీ అరేబియా ఏ మాత్రం సుముఖంగా లేదు. అది ఇజ్రాయిల్‌ను అధికారికంగా గుర్తించదు. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ గతంలో ఇజ్రాయిల్‌తో సంబంధాల పట్ల సుముఖత చూపారు. అయితే గాజాలో కొనసాగుతున్న యుద్ధం, ఇరాన్‌తో ఉద్రిక్తతలు, అరబ్ ప్రపంచంలో పెరుగుతున్న ఆగ్రహం కారణంగా అది సాధ్యపడలేదు. పాలస్తీనా దేశం ఏర్పాటుకు ఇజ్రాయిల్ స్పష్టమైన, తిరుగులేని వైఖరిని అవలంబించాల్సిందేనని సౌదీ అరేబియా కోరుతోంది. దీనికి ఇజ్రాయిల్ అంగీకరించడం లేదు.
ససేమిరా అంటున్న ఇరాన్
అబ్రహం ఒప్పందాలలో చేరాలని ఇరాన్ కూడా అనుకోవచ్చని ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో రాశారు. అయితే ఇది సాధ్యం కాదనే చెప్పాలి. ఇజ్రాయిల్‌ను గుర్తించేందుకు ఇరాన్ అనేక దశాబ్దాలుగా నిరాకరిస్తోంది. ఇజ్రాయిల్‌ను ఇప్పటికీ ఆక్రమణ దేశంగానే చూస్తోంది. అబ్రహం ఒప్పందాలలో చేరే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ గత సంవత్సరమే తేల్చి చెప్పారు. జాతి నిర్మూలనకు పాల్పడి, చిన్నారులను పొట్టనపెట్టుకున్న ఇజ్రాయిల్‌ను ఇరాన్ ఎన్నటికీ గుర్తించబోదని ఆయన తెలిపారు. అబ్రహం ఒప్పందాలపై సంతకాలు జరగడానికి చాలా కాలం ముందే ఇజ్రాయిల్‌తో అరబ్ దేశాలు సంబంధాలు ఏర్పరచుకోవడాన్ని ఇరాన్ వ్యతిరేకించింది.
ఏమిటీ ఒప్పందాలు?
2020లో అమెరికా మధ్యవర్తిత్వంతో అబ్రహం ఒప్పందాలు కుదిరాయి. యుఏఈ, బV్‌ారైన్, మొరాకో సహా పలు అరబ్ దేశాలకు, ఇజ్రాయిల్‌కు మధ్య అధికారిక సంబంధాలను నెలకొల్పడం ద్వారా ఈ ఒప్పందాలు మధ్యప్రాచ్యంలో ఓ చారిత్రక నమూనా మార్పుకు నాంది పలికాయి. అయితే పాలస్తీనా సమస్య పరిష్కారమయ్యే వరకూ ఇజ్రాయిల్‌ను గుర్తించడానికి పలు అరబ్ దేశాలు నిరాకరించాయి. అంతిమంగా ఈ ఒప్పందాలు ఉమ్మడి వ్యూహాత్మక ప్రయోజనాలపై దృష్టి సారించాయి. పశ్చిమాసియాలో అమెరికా మద్దతుతో ఓ కొత్త ప్రాంతీయ కూటమి ఆవిర్భావానికి దోహదపడ్డాయి.
ఇజ్రాయిల్‌ను గుర్తించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



