– అసహనానికి గురైతున్న పాత క్యాడర్
నవతెలంగాణ- చందుర్తి: కమలం పార్టీలో కార్యకర్తలు అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా ఎన్నికల పని చేయాల్సి ఉంటుంది. కానీ ప్రత్యేక గుర్తింపు కొరకు వచ్చిన వారిపట్ల కొంత మంది అసహనంతో ఉన్నారు.
అల్లాడి రమేశ్ పై అసహనం..!
ఎమ్మెల్యే రమేష్ బాబుకు వ్యతిరేకంగా పని చేయడంతో పాటు పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో ఆ పార్టీ నుండి పక్కకు పెట్టారు. దీంతో అల్లాడి రమేష్ బీజేపీలో చేరిన సంగతి విదితమే. దీంతో బీజేపీలో పాత క్యాడర్ మార్త సత్తయ్య, సిరి కొండ శ్రీనివాస్ తోపాటు సీనియర్ నాయకులు మొత్తంగా ఆయన రాకతో కొంత అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తుంది.
ఫెమాస్ కోసమే పెండ్లి రోజు!
బుధవారం రమేష్ పెండ్లి రోజు కావడంతో స్థానిక పేరుకు కళ్యాణ మండపంలో పెండ్లి రోజు వేడుకలకు మహారాష్ట్ర మాజీ గవర్నర్ ను పిలిచినట్టు ఆ పార్టీ నాయకులు కొందరు చెబుతున్నారు. దీంతో తన సంపదతో పార్టీలో ఫెమాస్ కవడానికే పెండ్లి రోజు జరుపుకున్నాడని ఆరోపించారు. దీంతో తమను జీరో చేయడానికే కాకుండా మండలంలో తమ గ్రాఫ్ ను కాపాడుకోవడానికి కమలం లో అల్లాడి రమేష్ కార్య క్రమాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.