- Advertisement -
నవతెలంగాణ-మల్హర్‌రావు: రోజురోజుకూ మండుతున్న ఎండల నేపథ్యంలో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధిహామీ కూలీల దాహార్తి తీర్చడానికి మండలం ఎడ్లపల్లి గ్రామంలో ఎడ్లపల్లి సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం ఉపాధి హామీ కూలీలకు మజ్జిక ప్యాకేట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చెన్నబోయిన సుగుణ,లావుడ్య రవీందర్ పాల్గొన్నారు.
- Advertisement -



