నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: తుర్కకాశ కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. గత శాసనమండలి సమావేశంలో తుర్క కాశ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు కృతజ్ఞతగా మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని పి.బి గార్డెన్‌లో తెలంగాణ తుర్కకాశ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.రాష్ట్ర అధ్యక్షులు షేక్ బడే సాబ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం సియాసత్ హబ్ ఫౌండేషన్ చైర్మన్ అమీర్ అలీ ఖాన్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి మంజూరైన రాళ్లు కట్ చేసే కట్టర్లను 100 మంది కార్మికులకు ఎమ్మెల్సీ సత్యం అమీర్ అలీ ఖాన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ బడే సాబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో తుర్కకాశ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను విన్నవించారు. కార్మికుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ సత్యం హామీ ఇచ్చారు
తుర్కాకాశ కార్మికులకు ప్రభుత్వం చేయూత: ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



