Tuesday, May 26, 2026
E-PAPER
Homeసినిమాఅందర్నీ మెప్పించే యూనివర్సల్ కాన్సెప్ట్

అందర్నీ మెప్పించే యూనివర్సల్ కాన్సెప్ట్

- Advertisement -

క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కాటాలన్ . ఈ సినిమా ఈనెల 28న పాన్-ఇండియా విడుదలకు రెడీ అవుతుంది. ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ మార్కో మేకర్స్ నుంచి వస్తున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం వహించారు. దుషార విజయన్, కబీర్ దుహాన్ సింగ్, టాలీవుడ్ నటుడు సునీల్, బాలీవుడ్ నటుడు పార్థ్ తివారీ, మలయాళ నటులు జగదీష్, సిద్ధిక్, వ్లాగర్-గాయకుడు హనన్ షా, రాపర్ బేబీ జీన్, హిప్స్టర్ వంటి భారీ తారాగణం ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సలార్ ఫేం రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది. మంగళవారం మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సునీల్ మాట్లాడుతూ,''పుష్ప తర్వాత నా లైఫ్ ఒక సర్‌ప్రైజింగ్ మోడ్‌లో పడింది. ఏ భాష నుంచి, ఎప్పుడు, ఎలాంటి క్యారెక్టర్ వస్తుందో నిజంగా నాకు తెలియడం లేదు(నవ్వుతూ). ‘జైలర్సినిమా చూసిన తర్వాత కేరళకు వెళ్లినప్పుడు కూడా నాకు తమిళ్‌లో సీన్ పేపర్లు ఇచ్చారు. ఈ సినిమాలో నేను ‘మారి’ అనే కీలక పాత్ర చేస్తున్నాను. ఇది నాకు చాలా తృప్తిని ఇచ్చిన పాత్ర. ఇలాంటి పాత్రను నేను ఇప్పటివరకు చేయలేదు. అలాంటి అవకాశం రావడం 'పుష్ప దయ అనుకుంటున్నాను. చాలా వెరైటీగా, వెర్సటైల్‌గా ఉండే పాత్ర ఇది. షరీఫ్ చాలా పెద్ద నిర్మాత. మార్కోతో అద్భుతమైన సినిమా తీశారు. ఖర్చుకు వెనకాడకుండా సినిమాలు తీసే నిర్మాత. డైరెక్టర్ పాల్ ఈ కథ చెప్పినప్పుడు నేను చాలా సర్‌ప్రైజ్ అయ్యాను` అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -