‘దర్శకుడు బుచ్చిబాబు ప్రతి ఎడి టింగ్ సెషన్ తర్వాత రామ్ చరణ్, రత్నవేలుకి నేషనల్ అవార్డు అని చెప్పేవారు. మాకు ఆ ఎగ్జైట్మెంట్ ఉంది. ఒక కథ రాసిన తర్వాత అది 60 శాతం స్క్రీన్ మీదకు వస్తే సూపర్ హిట్ అంటారు. కానీ బుచ్చి బాబు 200 శాతం స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు. ఆయన ఆనందం చూస్తుంటే నాకు చాలా హ్యపీగా అనిపించిందిఅని సినిమాటో గ్రాఫర్ రత్నవేలు అన్నారు. రామ్ చరణ్ నటించిన రూరల్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డీవోపీ రత్నవేలు మీడియాతో ముచ్చటించారు. బుచ్చిబాబు ఈ కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్. ‘రంగస్థలం’లో గోల్డెన్ బ్రౌన్ టోన్ వాడాను. అది చాలా పెద్ద విజ యాన్ని సాధించింది. 'పెద్దికి వస్తే 40 ఏళ్ళ క్రితం విజయనగరంలో ప్రజలు ఒక కలర్ ఎక్స్‌పీరియన్స్ చేసి వుంటారు. అలాంటి ఫీలింగ్‌ను రీక్రియేట్ చేయడానికి ప్రయత్నిం చాం. ప్రేక్షకులు మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు కనెక్ట్ అయ్యేలా ఒక మూడ్ క్రియేట్ చేశాం. కోవిడ్ తర్వాత సినిమా మారిపోయింది. ఇప్పుడు ప్రేక్షకులు రియలిజాన్ని కోరుకుంటున్నారు. అందుకే రియలిస్టిక్ ఫీలింగ్ ఉన్న విజువల్స్‌ను క్రియేట్ చేశాం. ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది సినిమాటోగ్రఫీని ప్రశంసించడం ఆనందంగా ఉంది.
‘పెద్ది’లో నాకు అత్యంత కాంప్లి కేటెడ్‌గా అనిపించింది క్రికెట్ మ్యాచ్. ఇది స్పోర్ట్స్ బేస్డ్ సినిమా. కెమెరామెన్‌తో పాటు మొత్తం టీమ్ చాలా అవేర్‌గా ఉండాలి. సినిమాలో వచ్చే సెకండ్ క్రికెట్ మ్యాచ్ చాలా కీలకం. అది కేవలం మ్యాచ్ మాత్రమే కాదు, కథలోనే ఒక పెద్ద మలుపు. ఆ మ్యాచ్‌ను రాత్రిపూట షూట్ చేద్దామని నేను బుచ్చిబాబు కి సూచించాను. 80లలో ఫ్లడ్‌లైట్ మ్యాచ్‌లు జరిగేవి. ఆ మూడ్ కోసం నైట్ షూట్ అయితే బాగుంటుందని అనిపించింది. ఆయనకు ఆ ఆలో చన నచ్చింది. షూటింగ్ తర్వాత రామ్ చరణ్ వచ్చి ‘అద్భుతమైన ఆలోచన, దీంతో సినిమా మరో స్థాయికి వెళ్లిందిఅని చెప్పారు. అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులకు కన్నుల పండుగలా ఉంటుంది. విజువల్ గ్రాండియర్‌తో పాటు ఎమోషనల్ హై కూడా ఉంటుంది. చివరి 30 నిమిషాలు సినిమా ప్రేక్షకులను కదిలిస్తుంది. 'పెద్ది పాత్ర కోసం రామ్ చరణ్ చేసిన ట్రాన్స్‌ఫర్మేషన్ అద్భుతం. ఫిజికల్ గా ఆయన చేసిన హార్డ్ వర్క్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బుచ్చిబాబు చాలా అద్భుతమైన కథ రాశారు. ఆయన రైటింగ్ చాలా బాగుంటుంది. అలాగే దాన్ని అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశారు. క్యారెక్టర్ సెలెక్షన్, పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్ అన్నీ బాగా వచ్చాయి. సతీష్ వండర్‌ఫుల్ ప్రొడ్యూసర్. ఆయనకు సినిమా అంటే ప్రాణం. ఒక విజువల్ చూసి చాలా ఎగ్జైట్ అవుతారు. ఎడిటింగ్‌లో బుచ్చి బాబుతో కలిసి ఒక సీన్ చూస్తూ చాలా ఎమోషనల్ అవుతుంటారు. ఇలాంటి నిర్మాతలు మరిన్ని సిని మాలు చేయాలని కోరుకుం టున్నాను.
రామ్ చరణ్ నట విశ్వరూపం చూస్తారు
- Advertisement -
- Advertisement -



