Tuesday, May 26, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిప్రశ్నించాలి..!

ప్రశ్నించాలి..!

- Advertisement -

జెండా కర్ర పట్టి కాళ్లరిగేలా తిరిగి
అలసిపోయిన గడపలకు
భరోసా ఒక బొమ్మలాట ఐపోయింది
జేజేలు పలుకుతూ భుజాన మోసి
అందలం ఎక్కించిన సామాన్యులకు
అడుక్కోవడమే పనైపోయింది
నమ్మకాన్ని ముళ్లకంపల్లో వేసి
సింహాసనాన్ని అలంకరించుకుని
నింగికేసిన చూపులో ధిక్కారం
బాణమై సగటు మనిషిని కూల్చితే
ఏకరువును మోయడమే శాపమైంది
ఎద్దేవాల రాపిడిలో పరిపాలన
నిప్పురవ్వలై ఎగసిపడుతుంటే
చూస్తూ కూర్చోవడమే వంతైంది
గాలి విసురుల వాటపు మాటలతో
మురిసి మునగడమే ఖర్మైంది
ప్రశ్నించే ప్రతి నాలుకపై
వాతలు పెట్టే రాతలదే పైచేయిగా
ఆగ్రహం పడగలిప్పి బుసలు కొడితే
ఓ మూలకు చేరి బ్రతకడమే పనైంది
ఇక ప్రశ్నలతోనే పరిష్కారానికి
పునాదులేసే సమయం వచ్చింది
నరెద్దుల రాజారెడ్డి ,
9666016636

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -