Wednesday, May 27, 2026
E-PAPER
Homeజాతీయంరేర్ మినరల్స్ పై దృష్టి

రేర్ మినరల్స్ పై దృష్టి

- Advertisement -

20 బిలియన్ డాలర్ల సమీకరణకు ఓకే
క్వాడ్ దేశాల నిర్ణయం
భారత్ లోని ముఖ్యఖనిజాలపై అమెరికా కన్ను

న్యూఢిల్లీ : కేంద్రీకృత ప్రపంచ సరఫరా నెట్‌వర్క్‌లపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఆర్థిక భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా క్వాడ్ దేశాలు (భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్) కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వ, ప్రయి వేట్ పెట్టుబడుల రూపంలో కీలక ఖనిజాల సరఫరా గొలుసులను బలోపేతం చేయడానికి 20 బిలియన్ డాలర్ల వరకు సమీకరించేందుకు ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికను ఆవిష్కరించాయి. ఈ మేరకు భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ సంయుక్తంగా ‘క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్ ఫ్రేమ్‌వర్క్’ను విడుదల చేశాయి.

ఫ్రేమ్‌వర్క్‌లో కీలక అంశాలు
ఈ ఫ్రేమ్‌వర్క్ అధునాతన సాంకేతికతలు, స్వచ్ఛ ఇంధన వ్యవస్థలు, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, టెలీ కమ్యూనికేషన్లు, రక్షణ రంగ తయారీకి అవసరమైన కీలక ఖనిజాల తవ్వకం, శుద్ధి, పునరుద్ధరణలో సహకారానికి ఒక విస్తృతమైన మార్గసూచిగా మారనుంది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో కీలక ఖనిజాలు, సముద్ర భద్రత, ఇంధన సమస్యలపై క్వాడ్ విదేశాంగ మంత్రులు ఢిల్లీలో సమావేశమై చర్చలు జరిపిన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది.

ఢిల్లీలో క్వాడ్ సమావేశం
కాగా, ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో క్వాడ్ విదేశాంగ మంత్రులు సమావేశం మంగళవారం జరిగింది. ఈ మీటింగ్‌లో భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌, అమెరికాకు చెందిన విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రపంచ ఇంధన పరివర్తన, ఉన్నత సాంకేతిక పరిశ్రమలకు కీలకమైన లిథియం, కోబాల్ట్, నికెల్, గ్రాఫైట్ వంటి అరుదైన ఖనిజాల లభ్యతకు సంబంధించి సరఫరా గొలుసులోని బలహీనతలు, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ పోటీపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ‘క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్ ఫ్రేమ్‌వర్క్’ను నాలుగు దేశాలు విడుదల చేశాయి. ఈ ఫ్రేమ్‌వర్క్ కింద క్వాడ్ భాగస్వాములు ఆర్థిక విధాన సాధనాలు, వ్యూహాత్మక పెట్టుబడులు ద్వారా సురక్షితమైన, వైవిధ్యమైన, న్యాయమైన ఖనిజ మార్కెట్ల అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రభుత్వ మద్దతుగల ఆర్థిక యంత్రాంగాలు, ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ద్వారా 20 బిలియన్ డాలర్ల వరకు సమీకరించాలనే ప్రతిపాదన ఈ చొరవలో ఒక ప్రధానాంశంగా ఉంది. రుణ సాయం, హామీలు, బీమా, ఈక్విటీ భాగస్వామ్యం, వ్యూహాత్మక ప్రాజెక్టుల కోసం వాణిజ్య ఆఫ్టేక్ ఏర్పాట్లు ఉండవచ్చని ఫ్రేమ్‌వర్క్ తెలియజేస్తోంది.

క్వాడ్ నెక్సస్ కి మద్దతు
క్వాడ్ దేశాలు ‘క్వాడ్ నెక్సస్’ ఉన్న ప్రాజెక్టులను గుర్తించి, వాటికి మద్దతు ఇవ్వాలని కూడా యోచిస్తున్నాయి. ఈ చొరవ ప్రపంచ కీలక ఖనిజ సరఫరా గొలుసులలో అధిక కేంద్రీకరణను తగ్గించడంతో పాటు, ఇండో-పసిఫిక్ ప్రాంతమంతటా పారిశ్రామిక స్థితిస్థాపకతను బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫ్రేమ్‌వర్క్ నియంత్రణా సమన్వయం, జాతీయ భద్రతా రక్షణ చర్యలకు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఈ ఫేమ్‌వర్క్‌లో అనుమతులు, లైసెన్సింగ్ వ్యవస్థలను మెరుగుపరచడం, నియంత్రణ ప్రక్రియలను క్రమబద్ధీకరించడం, జియోగ్రాఫికల్ మ్యాపింగ్, వనరుల అంచనాలో సాంకేతిక నైపుణ్యాన్ని పంచుకోవడం వంటి విషయాలలో తాము సహకరించుకుంటామని క్వాడ్ సభ్యదేశాలు తెలిపాయి. అయితే అమెరికా ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారటం..ప్రత్నామ్యాయ దేశాల్లోని ఖనిజాలవైపు అమెరికా కన్నెసింది. అందులో భాగంగానే అమెరికా విదేశాంగమంత్రి మార్క్ రోబియో ఢిల్లీలోనే మకాం వేసి అన్ని అగ్రిమెంట్లు దగ్గరుండి చేయించుకుంటున్నారు. భారత్ ను ఎలా తమవైపు మలుచుకుంటున్నాడో.. సమగ్రవివరాలన్నీ వైట్ హౌస్ బాస్ కు కబురందిస్తున్నట్టు సమాచారం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -