Wednesday, May 27, 2026
E-PAPER
Homeఆదిలాబాద్వంగిపోయిన 11కెవి పోల్స్‌..రైతుల్లో ఆందోళన

వంగిపోయిన 11కెవి పోల్స్‌..రైతుల్లో ఆందోళన

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హాత్నూర్: మండల పరిధిలోని గంగాపూర్ – లక్ష్మీ నాయక్ తండా గ్రామాల మధ్య రైతుల పంటచేలలో ఏర్పాటు చేసిన 11 కెవి విద్యుత్ పోల్స్ గత కొన్ని రోజులుగా వంగి ప్రమాదకరంగా మారాయి. ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితి ఉండటంతో రైతులు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో భారీ గాలులు, వర్షాలకు పోల్స్ కూలిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. పోల్స్ కూలితే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు రైతులు, పశువులకు ప్రాణహాని కలిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి వంగిపోయిన పోల్స్‌ను సరిచేసి ప్రమాదాన్ని నివారించాలని రైతులు విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -