నవతెలంగాణ-హైదరాబాద్: ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధినేత ఎంకే స్టాలిన్, కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జరిపిన దాడులను తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలపై “కేంద్ర సంస్థలను ఆయుధాలుగా వాడుకుంటున్న ధోరణి పెరుగుతోందని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. “కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విజయన్‌ను బీజేపీ లక్ష్యంగా చేసుకుందని, ఈ విషయంలో కాంగ్రెస్ చేస్తున్న నిర్లక్ష్యపు ఆరోపణల డొల్లతనాన్ని కూడా ఇది బట్టబయలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
“కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై జరిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రతిపక్ష నాయకులపై కేంద్ర సంస్థలను ఆయుధాలుగా వాడుకుంటున్న ధోరణి పెరుగుతోందన్న తీవ్ర ఆందోళనలను ఇటువంటి చర్యలు మరోసారి రేకెత్తిస్తున్నాయి’’ అని ఆయన రాసుకొచ్చారు.



