Monday, February 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన బిల్డింగులకు కొత్త పన్నులేవీ.?

నూతన బిల్డింగులకు కొత్త పన్నులేవీ.?

- Advertisement -

కార్యదర్శికి గ్రామస్తుడు వినతి
నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో అంతస్తుల కొద్దీ నిర్మించే కొత్త బిల్డింగ్ లకు కొత్త ఇంటి పన్నులు ఏవి అంటూ సోమవారం గ్రామస్తుడు రౌతువార్ నాగేష్ గ్రామ కార్యదర్శి ఎం సందీప్ కుమార్ కు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. మద్నూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఎక్కువ పోర్షన్ లు గల కొత్త బిల్డింగులు నిర్మించే వాటికి, పాత కూన పెంకుటిల్లులకు ఒకే రకమైన ఇంటి పన్నులు ఉండటం ఏమిటని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఇంటి నిర్మాణం విస్తీర్ణాన్ని పెరగడమే కాకుండా అంతస్తుల కొద్దీ కొత్త బిల్డింగులు నిర్మించినా పాత ఇంటికున్న ఇంటి పన్నులే వసూళ్లు చేస్తున్నారని, ఈ విషయంపై గ్రామ కార్యదర్శి నూతన బిల్డింగులు నిర్మించిన వాటిని సర్వే చేసి ఇంటి పన్నులు పెంచి గ్రామపంచాయతీకి ఆదాయాన్ని రాబట్టడానికి కృషి చేయాలని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ విషయంపై నవతెలంగాణ విలేఖరి వివరణ కోరగా.. గ్రామస్థుని విన్నపం సరైనదేనని అన్నారు. కొత్తగా నిర్మించిన బిల్డింగులను సర్వే చేయడానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పన్నులు పెంచే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -